ETV Bharat / state

మిగ్​జాం తుపానుతో వేల ఎకరాల్లో కూరగాయల పంటలకు తెగుళ్లు- ప్రభుత్వమే ఆదుకోవాలంటూ అన్నదాతల వేడుకోలు - మన్యం జిల్లా తాజా వార్తలు

Farmers Lost Their Vegetable Crops in Michaung Cyclone Effect: ఇటీవల సంభవించిన మిగ్​జాం తుపాను ప్రభావానికి కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పు చేసి వేల రూపాయలు పెట్టుబడి పెట్టినా అతివృష్టి వల్ల పంటలు దెబ్బతినటంతో రైతులు ఆవేదన చెెెందుతున్నారు.

farmers_lost_their_vegetable_crops_in_michaung_cyclone_effect

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2023, 6:30 PM IST

Farmers Lost Their Vegetable Crops in Michaung Cyclone Effect: భూమాతను నమ్ముకొని ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు చేతికొచ్చే వరకు నమ్మకం లేని పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల సంభవించిన మిగ్​జాం తుపాను ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన కూరగాయల పంట సాగుదారులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాల్లో వంకాయ, బెండ, క్యాబేజీ, చిక్కుడు, బీర తదితర పంటలను నష్టపోయి రైతులు అప్పుల పాలయ్యారు. అప్పు చేసి వేల రూపాయలు పెట్టుబడి పెట్టినా అతివృష్టి వల్ల పంటలు దెబ్బతినటంతో రైతులు ఆవేదన చెెెందుతున్నారు.

Crops Loss In Parvathipuram And Manyam District: పార్వతీపురం, మన్యం జిల్లాలో సుమారు 5వేల ఎకరాల్లో కూరగాయలు పంటలను రైతులు సాగు చేస్తున్నారు. క్యాబేజీ, బీర, వంగ, టమాటా, చిక్కుడుతో పాటు ఆకుకూరలు విరివిగా పండిస్తున్నారు. ఇటీవల సంభవించిన మిగ్​జాం తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురవకపోయినా ఎడతెరిపి లేకుండా మూడు రోజులు పాటు కురిసిన వర్షాలకు కూరగాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా కాలీఫ్లవర్ పువ్వులు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం కారణంగా తెగుళ్లు బారిన పడి నల్లగా మాడిపోయి పాడైపోతున్నాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిండా ముంచిన మిగ్‌జాం తుపాను - ఆందోళనలో రైతులు

Vegetable Crops Loss In Farmers: కాలీఫ్లవర్ పువ్వుపై నల్లని బూడిద రంగు ఏర్పడి క్రమేనా అది పూర్తిగా పాడవుతోంది. అలాగే వంకాయలు కూడా పిండి దశలోనే గడుసు వారిపోతున్నాయి. బెండకు తెగులు సోకటంతో కాయలకు రంధ్రాలు పడి ఎండిపోతున్నాయి. అదే విధంగా బీర, చిక్కుడు పాదులు నీటి దాటికి పూర్తిగా నాశనం అయ్యాయి. వేలాది రూపాయలు మదుపు పెట్టి పంట సాగు చేస్తే వర్షం దాటికి పంట నష్టంతో అప్పు తీర్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు.

ఇక్కడ ఒక 60ఎకరాల వరకు కూరగాయలు పండిస్తున్నాం. వర్షాలు కురవటంతో పంటలకు మచ్చతెగులు వచ్చేసి పంట మొత్తం పాడైపోయింది. సాగు చేసిన అన్ని రకాల పంటలకు ఎదొక తెగులు రావటంతో పంట చేతికి రాలేదు. ఎకరాకు దాదాపు 35వేల వరకు పెట్టుబడి పెట్టాం. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు పరిహరం అందిస్తాదని కోరుకుంటున్నాం.- వెంకట రమణ,రైతు.

పొలాలను పశువులకు మేపుతున్న రైతులు - కన్నీళ్లు మిగిల్చిన కరవుపై చోద్యం చూస్తున్న ప్రభుత్వం

Government Support To Farmers Lost Their Crops: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి పంట మొత్తం తడిసి ముద్దైంది. వర్షం దెబ్బకు పాడైన క్యాబేజీ పువ్వులు, ధ్వంసమైన వరి పంట, గిడస బారిన వంకాయలు, దెబ్బతిన్న చిక్కుడు, బీర, రంధ్రాలు పడిన బెండకాయలు అన్ని రకాల కూరగాయ పంటలు మొత్తం నాశనం అయ్యాయని రైతులు కన్నీటిపరమవుతున్నారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం అందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతుల అవస్థలు - ధాన్యం కొనే దిక్కులేక ఎదురుచూపులు

మిగ్​జాం తుపాను వల్ల బలైపోయిన పంటలు- నష్టపోయిన రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.