Sambara Polamamba Jatara: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర పోలమాంబ జాతర సందర్భంగా ఈరోజు తోలేళ్ల ఉత్సవం జరిగింది. రేపు జరిగే కీలకమైన సిరిమానోత్సవ ఘట్టానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 25వ తేదీన బుధవారం నాడు అమ్మవారి అంపకోత్సవము జరుగుతుంది. ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తు భక్తులు వస్తారని, సుమారు 2లక్షల మంది హజరైయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాతరకు సుమారుగా 150 ఆర్టీసీ బస్సుల ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 850 మందితో భారీగా పోలీసులను బందోబస్తుకోసం నియమించారు. భధ్రత పరంగా ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా చూస్తామని ఆలయ పోలీసులు వెల్లడించారు.
వికలాంగులకు, చిన్న పిల్లలకు, వృద్ధులకు ప్రత్యేక దర్శనానికి పోలీసులకు.. కమిటీ సభ్యులకు నివేదికను ఇచ్చారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు. మరుగుదొడ్లు ఏర్పాట్లు చేశారు. జేబు దొంగతనాలు.. చిన్నపిల్లల చోరీలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అంతే కాకుండా మున్సిపాలిటీ సిబ్బందితో.. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రం చేస్తామని చెప్పారు. సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: