ETV Bharat / state

YSRCP Leaders Attack: అక్రమాలను ప్రశ్నిస్తే.. వైసీపీ నేతలు దాడి చేశారు: బాధితులు - వైఎస్సార్‌సీపీ నేతల దాడి

YSRCP Leaders Attacked TDP Activist: అక్రమాలను ప్రశ్నించినందుకు.. అమరావతిలో టీడీపీ కార్యకర్త ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారు. అర్ధరాత్రి వేళ గుంపుగా వచ్చి.. టీడీపీ కార్యకర్త సంజయ్​పై దాడికి యత్నించడంతో.. అతని భార్య అడ్డుకుంది. వైసీపీ నేతలు ఆమెపై దాడి చేశారు. దీంతో వైసీపీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు.

YSRCP Leaders Attack
వైఎస్సార్‌సీపీ నేతల దాడి
author img

By

Published : Jul 7, 2023, 4:38 PM IST

YSRCP Leaders Attacked TDP Activist: పల్నాడు జిల్లా అమరావతిలో తెలుగుదేశం కార్యకర్త వద్ధినేని సంజయ్ ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారు. అర్థరాత్రి గుంపుగా ఇంటికి వచ్చిన వైసీపీ నేతలను సంజయ్ భార్య శ్రీదేవి అడ్డుకుంది. దాడి చేసేందుకు వచ్చిన వారిని చరవాణిలో చిత్రీకరించేందుకు యత్నించగా.. వైసీపీ నాయకులు ఫోన్ లాక్కుని ఆమెపై దాడి చేశారు.

అక్రమాలను ప్రశ్నించినందుకు: బాధితురాలు కేకలు వేయడంతో.. అక్కడినుంచి వారు పారిపోయారు. దాడికి పాల్పడిన వైసీపీ నేత నండూరి కరుణ కుమార్ సహా మరో ఆరుగురిపై సంజయ్‌ భార్య శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతిలో వైసీపీ వాలంటీర్ కంభంపాటి దినేష్.. జగనన్న కాలనీలో ఇళ్లు ఇప్పిస్తానని బాధితులను మోసం చేశారు. దీన్ని సోషల్ మీడియాలో సంజయ్‌ పోస్ట్ చేశారు. దీనిని తొలగించాలంటూ తమ ఇంటిపై దినేష్ మద్దతుదారులు దాడి చేశారని బాధితులు వాపోయారు.

టీడీపీ కార్యకర్త ఇంటిపై వైసీపీ నేతల దాడి.. రక్షణ కల్పించాలంటున్న బాధితులు

ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలి: వైసీపీ నేత నండూరి కిరణ్ కుమార్ అలియాస్ బన్నుతో మాకు ప్రాణహాని ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి కాలచక్ర కాలనీలో వాలంటీర్ దినేష్ అవినీతిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే.. మాపై దాడిచేశారని టీడీపీ మద్దతుదారులు వద్దినేని సంజయ్‌ కుమార్, శ్రీదేవి వాపోయారు. తమ ఇంటిపై దాడి చేయడం ఇది రెండోసారి అని.. తమ కుటుంబానికి బన్ను వల్ల ప్రాణ హాని ఉందని.. పోలీసులు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు.

అర్ధరాత్రి సోషల్ మీడియా కార్యకర్తపై దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్తామని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. వైసీపీ నేతల దౌర్జన్యాలను, అవినీతిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూనే ఉంటామని..బెదిరింపులకు భయపడేది లేదని బాధితులు తెలుపుతున్నారు.

వైసీపీ నేతలకు గుణపాఠం చెప్తాం: జగన్ లాగానే.. ఆయన కార్యకర్తలు కూడా తయారయ్యారని టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ మండిపడ్డారు. దౌర్జన్యం.. దుర్మార్గం వైసీపీకి పేటెంట్ హక్కుగా మారిపోయాయని విమర్శించారు. మీ తప్పులను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే.. దాడులకు తెగబడతారా అంటూ ప్రశ్నించారు.

రాష్ట్రంలో చట్టం కూడా వైసీపీకి చుట్టంగా మారిపోయిందని.. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు.. వైసీపీ నేతలకు దాసోహం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో.. దాడికి పాల్పడడం వైసీపీ నేతల పిరికిపంద చర్య అని అన్నారు. వైసీపీ నేతల దుర్మార్గాలు, దాడులకు.. త్వరలోనే గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కార్యకర్తలను.. తెలుగుదేశం పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు.

"ముసుగులు కట్టుకొని 30 మంది వరకూ వచ్చారు. రాత్రి 11.30కి వచ్చారు. అందులో బన్ను అనే వ్యక్తి మెడ పట్టుకున్నాడు. రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాం. మాకు తగిన న్యాయం చేయాలి". - శ్రీదేవి, బాధితురాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.