ETV Bharat / state

SUICIDE ATTEMPT: ఎస్పీ కార్యాలయం వద్ద ఇద్దరు ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే?

SUICIDE ATTEMPT: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయం వద్ద ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు. అప్పు తీసుకున్న వారు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఒకరు,.. తన సమస్య కోసం ఎస్పీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని మరొకరు బలవన్మరణానికి ప్రయత్నించారు.

SUICIDE ATTEMPT
ఎస్పీ కార్యాలయం వద్ద ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jun 9, 2022, 5:41 PM IST

SUICIDE ATTEMPT AT SP OFFICE: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పు తీసుకున్న వారు తిరిగి డబ్బులివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని శివాపురానికి చెందిన ఆనంతరామిరెడ్డి ఆరోపించాడు. అధికారులే తన సమస్యకు పరిష్కారం చూపాలని నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే పోలీసులు బాధితుడిని చికిత్స కోసం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

పెట్రోల్ డబ్బాతో మరొకరు..: నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి పెట్రోల్ డబ్బాతో హల్​చల్​ చేశాడు. వినుకొండకు చెందిన మౌలాలి అనే వ్యక్తి తన సమస్య పరిష్కారం కోసం ఎస్పీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని ఆరోపించాడు. పెట్రోల్‌ డబ్బాతో వచ్చిన అతడిని పోలీసులు అడ్డుకున్నారు. తన సమస్యను పరిష్కరించాలని మౌలాలి డిమాండ్ చేశాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.