ETV Bharat / state

అధికార వైసీపీ నాయకుల అండతో - పల్నాడు జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా - త్రిపురాపురం కొండ వద్ద అక్రమ తవ్వకాలు

Tripurapuram Hill Illegal Excavations: పల్నాడు జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలకు కొండలు కరిగిపోతున్నాయి. అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తూ.. అధికారపార్టీ నేతలు కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. అక్రమ తవ్వకాలతో పల్నాడు జిల్లా త్రిపురాపురం కొండ గుండుకొట్టిన చందంగా మారింది.

tripurapuram_hill_illegal_excavations
tripurapuram_hill_illegal_excavations
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 19, 2023, 9:55 PM IST

Tripurapuram Hill Illegal Excavations: మట్టి మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. వారి ఆక్రమాలకు కొండలే కరిగిపోతున్నాయి. గత మూడు సంవత్సరాలుగా సాగుతున్న ఈ దందాతో అధికారపార్టీ నేతలు కోట్ల రూపాయలను మూట గట్టుకున్నారు. వైసీపీ ముఖ్యనాయకులు అండదండలతో వీరి అక్రమాలకు అడ్డు అనేదే లేకుండా పోయింది. అక్రమ మట్టి తవ్వకాలతో పచ్చగా ఉండాల్సిన పల్నాడు జిల్లా త్రిపురాపురం కొండ గుండు కొట్టినట్లుగా కనిపిస్తోంది. గతంలో ఎంతో హరితంగా, ఆహ్లదకరంగా ఉండే కొండ నేడు తవ్వకాలతో బోసిపోయింది. ఇదే విధంగా ఆక్రమాలు కొనసాగితే కొండ కనిపించకుండాపోయినా ఆశ్చర్యం అవసరం లేదని స్థానికులు వాపోతున్నారు.

Red Soil ఎర్రమట్టి వనరులు అధికం: నకరికల్లు మండలంలోని త్రిపురాపురం పరిధిలో అద్దంకి - నార్కట్‌పల్లి రహదారి సమీపంలో త్రిపురాపురం కొండ ఉంది. ఈ కొండపై నాణ్యమైన ఎర్ర మట్టి వనరులు అధికంగా కలవు. అయితే తొలుత అధికారుల అనుమతులు తీసుకున్న వైసీపీ నాయకులు.. కొండ కిందిభాగంలో కొంత తవ్వకాలు చేపట్టారు. అనుమతులు పూరైన తర్వాత కూాడ వారి తవ్వకాలు ఆగలేదు.

గోదావరి తీరంలో ఇసుక తోడేళ్లు - గడువు పూర్తైనా యథేచ్ఛగా ఇసుక దందా

అక్రమార్జనకు అలవాటై మూడు సంవత్సరాలుగా తవ్వకాలు: అనుమతుల వంటివి లేకపోవడంతో పన్నులు, రాయల్టీ వంటివి చెల్లించనవసరం లేకపోవడంతో అక్రమార్జన గావించారు. ఇదే అదనుగా భావించి గత మూడు సంవత్సరాలుగా కొండపై తవ్వకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. వెంచర్లకు, లోతట్టు ప్రాంతాల మెరకకు ఇక్కడి మట్టిని తరలిస్తున్నారు. ఈ విధంగా నిత్యం టిప్పర్లతో రసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, కారంపూడి ప్రాంతాలకు మట్టి అక్రమ రవాణా సాగుతూనే ఉంది.

Silica Sand: 5వేల కోట్ల రూపాయల సిలికాను దోచేశారు - నెల్లూరు జిల్లాలో అక్రమ తవ్వకాలపై కలెక్టర్​కు ఫిర్యాదు చేసిన టీడీపీ

అధికార వైసీపీ ముఖ్యనాయకుల అండతో: వైసీపీ నాయకులకు అధికార పార్టీ ముఖ్యనేతల అండదండలు తోడవడంతో.. అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ అక్రమ రవాణా కాసులు కురిపించడంతో.. అధికార వైసీపీ నాయకులు దీనినే వృత్తిగా మార్చుకున్నారు. యంత్రాల ద్వారా రాత్రిపగలు తేడా లేకుండా.. తవ్వకాలు చేపట్టారు.

ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని స్థానికుల ఆందోళన: ఈ తవ్వకాల వల్ల అక్కడ ప్రమాదకర రీతిలో భారీ గోతులు ఏర్పడుతున్నాయి. వీటివల్ల ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ముఖ్యనేతల బలం.. అధికారులు పట్టించుకోకపోవడంతో.. అక్రమ తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.

Illegal Mining: యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు.. మరోసారి సంయుక్త కమిటీ పరిశీలన

అధికార వైసీపీ నాయకుల అండతో - పల్నాడు జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.