ETV Bharat / state

Police Arrested Danda Nagendra: ప్రశ్నిస్తే కేసులే.. మరోసారి నిరూపించిన వైసీపీ ప్రభుత్వం..దండా నాగేంద్ర అరెస్టుపై ఉత్కంఠ - AP Latest News

Police Arrested Danda Nagendra: ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీ (National Green Tribunal)కి ఫిర్యాదు చేసిన దండా నాగేంద్రపై సర్కారు కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇసుక అక్రమాలపై ఎన్జీటీలో ఫిర్యాదు చేశారని నాగేంద్రకుమార్‌పై వరుస కేసులు పెట్టారు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆదివారం ఓ శుభకార్యానికి వచ్చిన ఆయన్ని కారణం ఏంటనేది చెప్పకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చివరికి అక్రమ మద్యం కేసులో అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

police_arrested_danda_nagendra
police_arrested_danda_nagendra
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2023, 7:36 AM IST

Police Arrested Danda Nagendra: ప్రశ్నిస్తే కేసులే.. మరోసారి నిరూపించిన వైసీపీ ప్రభుత్వం..దండా నాగేంద్ర అరెస్టుపై సర్వత్రా ఉత్కంఠ

Police Arrested Danda Nagendra: ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(National Green Tribunal)లో ఫిర్యాదు చేసినందుకు పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోటకు చెందిన దండా నాగేంద్రకుమార్‌పై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధిస్తోంది. ఎన్జీటీ(NGT)లో ఆయన వేసిన పిటిషన్‌ను విచారించిన ట్రైబ్యునల్‌ ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి ఆయన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత పల్నాడు జిల్లా అమరావతిలో శుభకార్యానికి హాజరయ్యేందుకు స్నేహితుడి ఇంటికి వెళ్లిన నాగేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర సంచలనంగా మారింది. అమరావతి స్టేషన్‌లో గంటపాటు ఉంచిన తరువాత సీఐ బ్రహ్మం నాగేంద్రను బయటకు తీసుకెళ్లారు. పోలీసు వాహనంలో రాత్రి 7 గంటల వరకు పలు ప్రాంతాల్లో తిప్పి ఆఖరుకి ముప్పాళ్ల స్టేషన్‌కు తీసుకెళ్లారు. చివరికి అక్రమంగా మద్యం సీసాలు కలిగి ఉన్నారనే కేసులో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తాపీగా చెప్పారు.

Drunk and Drive గుడివాడలో పోలీసుల అత్యుత్సాహం.. డ్రంకన్ డ్రైవ్​లో వాహనం స్వాధీనంతో వ్యక్తి ఆత్మహత్య

Nagendra Wife Blocked Police Vehicle: తన భర్తను పోలీసులు తీసుకెళ్లారని తెలుసుకున్న నాగేంద్ర భార్య అనూష అమరావతి స్టేషన్‌కు వెళ్లారు. అప్పటికే పోలీసు జీపులో ఆయన్ను తీసుకెళుతుండగా ఆమె మరో వాహనంలో వెంబడిచారు. అమరావతి నుంచి క్రోసూరు వైపు, అటు నుంచి పెదకూరపాడు మీదుగా సత్తెనపల్లి వైపు నాగేంద్రను తీసుకెళ్లారు. ఆ తరువాత దారి మళ్లించి గుడిపూడి, అబ్బూరు, రెంటపాళ్ల మీదుగా భృగుబండ వైపు తీసుకెళుతుండగా అనూష పోలీసు వాహనానికి అడ్డుపడ్డారు. రోడ్డుపై బైఠాయించి నా భర్తను ఎక్కడకు తీసుకెళుతున్నారు? ఎందుకు తీసుకెళుతున్నారంటూ పోలీసులను నిలదీశారు.

CI said Nagendra is Being Arrested in a Liquor Case: మద్యం కేసులో అరెస్టు చేసి సత్తెనపల్లి కోర్టుకు తీసుకెళుతున్నట్లుగా సీఐ ఏవీ బ్రహ్మం పేర్కొన్నారు. అమరావతిలో అరెస్టు చేసి పిడుగురాళ్ల వైపు ఎందుకు తీసుకెళుతున్నారని నాగేంద్ర న్యాయవాది లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. దీంతో పోలీసులు అప్పటికప్పుడు రిమాండ్‌కు తరలిస్తున్నామని చెబుతూనే, మళ్లీ ముప్పాళ్ల స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రి 9 గంటల వరకు కూడా రిమాండ్‌ రిపోర్టు తయారు చేసే పనిలోనే ఉన్నారు. రిమాండ్‌ రిపోర్టు లేకుండా అమరావతి నుంచి సత్తెనపల్లి వైపు ఎందుకు తీసుకువెళ్తున్నారు అనే దానికి పోలీసుల నుంచి సరైన సమాధానం లేదని తెలిపారు.

Sand Prices in AP: అక్రమార్కులకు ఇసు'కాసుల' పంట.. ప్రజల జేబులకు చిల్లు పెడుతూ అడ్డగోలుగా దోపిడీ..

Danda Nagendra complained to NGT about illegal sand mining: ఇసుక తవ్వకాలపై ఫిర్యాదు చేసినందుకే పెదకూరపాడు వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఆయన కుమారుడు తన భర్తపై కక్ష కట్టారని నాగేంద్ర భార్య ఆరోపించారు. తన భర్తకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. నాగేంద్ర ఎన్జీటీలో వేసిన పిటిషన్‌పై ఆదేశాలు వచ్చిన కొన్నిరోజులకే అమరావతి స్టేషన్‌లో ఓ వైసీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు ఆయనపై ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయన బెయిల్‌ తెచ్చుకున్నారు. గతంలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావుతో నాగేంద్ర సఖ్యతగా ఉండేవారు. ఎన్జీటీలో పిటిషన్‌ వేసిన నాటి నుంచి ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్నారు.

YCP govt actions against Danda Nagendra: అమరావతిలోని నాగేంద్రకు సంబంధించిన అతిథిగృహానికి నోటీసులు ఇచ్చిన దగ్గర నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇటీవలే తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసి వైసీపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని తెలియజేశారు. తనపై లేనిపోని కేసులు పెట్టడంతో తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. హరిత ట్రైబ్యునల్‌లో కేసు దాఖలు విషయంలో నాగేంద్రను ప్రోత్సహించిన కంచేటి సాయిని ఇప్పటికే పీడీ యాక్టు కింద అరెస్టు చేసి జైలుకు పంపడం గమనార్హం.

Police Removed TDP Banners at Yuvagalam Padayatra TDP Leaders Allegations: "అధికారుల ఒత్తిడితోనే వైసీపీ బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నాం"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.