TDP National General Secretary Nara Lokesh Yuvagalam Padayatra Updates: ''ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ దొంగల దెబ్బకు..కొండలు, గుట్టలు, వాగులు, వంకలు మాయమవుతున్నాయి. 3.16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు నేతృత్వంలో ఆయన అనుచరులు ఇష్టారాజ్యంగా తవ్వేసి, కోట్లాది రూపాయల గ్రావెల్ దోచేశారు. వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయేనాటికి ఆంధ్రప్రదేశ్‌లో కొండలు అనేవి కన్పించకూడదని సైకో బ్యాచ్ ఒట్టు పెట్టుకున్నట్లుగా కన్పిస్తోంది. ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచేస్తున్న ఈ జగన్ అండ్ కోకు రాష్ట్ర ప్రజలు బోడిగుండు కొట్టించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.'' అంటూ టీడీపీ యువనేత నారా లోకేశ్ 175వ రోజు 'యువగళం' పాదయాత్రలో జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
175వ రోజుకు చేరిన యువగళం.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నేటితో 175వ రోజుకు చేరింది. నేటి పాదయాత్రను ఈపూరు మండలం వనికుంట నుంచి ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా వనికుంట, కూచినపల్లి గ్రామాల స్థానికులతో లోకేశ్ ముచ్చటించారు. కూచినపల్లిలో సాగర్ కాలువ దాటేందుకు వంతెన లేకపోవడంతో తాము నానా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. దాంతో టీడీపీ అధికారంలోకి వచ్చాక వంతెన నిర్మిస్తామని గ్రామస్థులకు యువనేత హామీ ఇచ్చారు.
జగన్ పాలనలో ప్రజాస్వామ్యం మరోసారి ఖూనీ.. నారా లోకేశ్ మాట్లాడుతూ..'' జగన్‌కు.. అతని అనుచరులకు దోచుకోవడమే తప్ప మరే పని చేయడం తెలియదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. కూచినపల్లిలో సాగర్ కాలువ వంతెన నిర్మిస్తాం. ఈ సైకో జగన్ ఫ్యాక్షన్ పాలనలో ప్రజాస్వామ్యం మరోసారి ఖూనీ అయ్యింది. పోలీసుల సమక్షంలో ప్రతిపక్షంపై దాడి చేసి, బంద్ చేయడం ఒక్క వైసీపీకే చెల్లింది. వైసీపీ గూండా మూకలు బంద్ నెపంతో చిత్తూరులో అమరరాజా కంపెనీ బస్సుని ధ్వంసం చేసి, ఉద్యోగులపై దాడి చేశారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఎక్కడ ఉన్నారు..?. బంద్ పేరుతో వైసీపీ అల్లరి మూకల దాడుల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా.'' అని అన్నారు.
Lokesh Padayatra in Vinukonda: వినుకొండలో లోకేశ్ పాదయాత్ర.. అడుగడుగునా బ్రహ్మరథం
టీడీపీ వచ్చాక ఇంటింటికి ఉచిత తాగునీరు అందిస్తాం.. బొమ్మరాజుపల్లెలో భోజన విరామం తీసుకున్న లోకేశ్..వినుకొండ నియోజకవర్గంలోని బొమ్మరాజుపల్లిలో లంబాడి వర్గీయులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో లంబాడీల సమస్యలను సావధానంగా తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ అని యువనేత లోకేశ్ గుర్తు చేశారు. ఎన్టీఆర్ హయాంలో ఐటీడీఏ ఏర్పాటు చేశారమన్నారు. గిరిజన తండాల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యాలు చంద్రబాబు కల్పించారని పేర్కొన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో కూడా ఇంటింటికి ఉచిత తాగునీరు అందిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. వరికెపుడిసెల ప్రాజెక్టు వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో వరికెపుడిసెల పూర్తిచేస్తామని లోకేశ్ తెలిపారు. అంతేకాకుండా, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. గత నాలుగేళ్లుగా పోస్టులు భర్తీకాక నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nara Lokesh Allegations on Vinukonda MLA: 'వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కాదు.. కబ్జాల రాయుడు'