Mother And Son Died in Electric Shock: పల్నాడు జిల్లాలో యువకుడికి విద్యుత్ షాక్ తగిలింది. అతడ్ని కాపాడేందుకు తల్లి ప్రయత్నించగా ఆమెకు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంతో తల్లీకుమారులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కారంపూడి లోని ఇందిరానగర్‌కు చెందిన రామకోటయ్య అనే యువకుడు బట్టలు ఆరేస్తుండగా అతనికి విద్యుత్ షాక్ తగిలింది. దీనిని గమనించిన తల్లి నాగమ్మ కుమారుడ్ని కాపాడే ప్రయాత్నం చేసింది. ఈ క్రమంలో ఆమెకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో తల్లికుమారులిద్దరూ విద్యుత్ ప్రమాదంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతుడు రామకోటయ్య వయస్సు 30 సంవత్సరాలు కాగా అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెక్కడితేగాని డొక్కడని కుటుంబమని.. వారి కుటుంబంలో ఇలా జరగడం బాధకరమని గ్రామస్థులు అంటున్నారు.
ఇవీ చదవండి: