Minister Ambati Rambabu: రాష్ట్రంలో అన్ని జలాశయాల్లో తగిన నీరు ఉన్నందున ముందస్తు సాగుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలోని పులిచింతల ప్రాజెక్టును సందర్శించారు. ప్రోజెక్టు మొత్తాన్ని పరిశీలించారు. జలాశయం పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కొట్టుకుపోయిన 16వ నంబరు గేటును, ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్టాప్ లాక్గేట్ను పరిశీలించారు. త్వరలోనే నిపుణులు కమిటీ పర్యటించి గేట్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు అందించేందుకు ఇప్పటికే విత్తనాలు సిద్ధం చేశామన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇవీ చదవండి: