Macharla Incident : పల్నాడు జిల్లా మాచర్లలో నిన్న జరిగిన దమనకాండ వైసీపీ అరాచకానికి నిదర్శనమని మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బ్రహ్మారెడ్డి అన్నారు. మాచర్లలో గత రాత్రి చెలరేగిన ఘటనకు సంబంధించి ఆయన వీడియోను విడుదల చేశారు. వైసీపీ నాయకులు, శ్రేణులు ఆయుధాలతో రాగా.. పోలీసుల జాడా ఎక్కడా కనపించలేదన్నారు. రాడ్లు, షోడాబుడ్లు విసిరేసిన తర్వాతే.. టీడీపీ వాళ్లు ప్రతిఘటించారని తెలిపారు. ఆ తర్వాత పోలీసులు వచ్చారని.. టీడీపీ వారిపై లాఠీ ఛార్జి చేశారని.. తనను బలవంతంగా తరలించారని బ్రహ్మారెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు వారి ఇళ్లకు వాళ్లే నిప్పుపెట్టుకున్నారని అనటం సిగ్గు చేటని అన్నారు.
ఇవీ చదవండి: