ETV Bharat / state

శివ శివా..! మహాశివరాత్రి పర్వదినాన.. కోడిపందాలు,మద్యం అమ్మకాలు..! - పల్నాడు జిల్లాలో పందెం కోడి రెక్కలు విప్పింది

Kodi Pandhalu In Rompicharla: కోటప్పకొండ తిరునాళ్ల పురస్కరించుకుని అధికార పార్టీ నేతలు రెచ్చిపోయారు. కోడి పుంజుల కాలికి కత్తి కట్టి బరిలోకి వదిలారు. మరోపక్క కోటప్పకొండ తిరునాళ్ల వేడుకల్లో యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జరిగాయి. పోలీసులు, అధికారుల మాత్రం పట్టిపట్టనట్లు ఉన్నారు. రాష్ట్రీయ రహదారిపై దాచేపల్లి పాత బస్టాండు సెంటర్లో కారు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది.

Kodi Pandhalu In Rompicharla
రొంపిచర్లలో కోడి పందాలు
author img

By

Published : Feb 19, 2023, 1:39 PM IST

Kodi Pandhalu In Rompicharla: పల్నాడు జిల్లాలో పందెం కోడి రెక్కలు విప్పింది. కోటప్పకొండ తిరునాళ్ల పురస్కరించుకుని అధికార పార్టీ నేతలు రెచ్చిపోయారు. కీలక నేత ఆశీస్సులతో అడ్డూ అదుపు లేకుండా బరులు సిద్ధం చేశారు. నాలుగైదు రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండే రొంపిచర్ల గ్రామం కోడి పందేలకు స్థావరమైంది. ప్రణాళిక మేరకు ముందుగానే అధికారులు, పోలీసులపై నియోజకవర్గంలో కీలక నేతతో ఒత్తిడి చేయించారు. దీంతో నాలుగైదు రోజుల ముందు నుంచే కొనకంచివారి పాలెం, మునమాక, ఇంద్రగిరి మార్గంలోని పొలాల్లో రెండు బరులు ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, తెలంగాణ ప్రాంతాల జూదగాళ్లకు కబురు పెట్టారు. నిర్దేశిత షెడ్యూల్ మేరకు వీరందరూ బరుల వద్దకు చేరుకున్నారు. డబ్బు మధ్యవర్తుల చేతిలో పెట్టారు. కోడి పుంజుల కాలికి కత్తి కట్టి బరిలోకి వదిలారు. గెలుపోటములు నిర్ధారించి కమీషన్లు నొక్కేసి మిగతా సొమ్ము పంపిణీ చేశారు. ఇలా రోజంతా రూ. కోట్లాది లావాదేవీలు సాగినట్లు సమాచారం. పాత్రికేయులు, ప్రత్యర్థులకు ప్రవేశం లేకుండా నేతలు తమ అనుచరులను కాపలా పెట్టారు. చరవాణిలో పందేలను చిత్రీకరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయమై పోలీసులను వివరణ అడిగేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

కోటప్పకొండ తిరునాళ్ళలో యథేచ్ఛగా మద్యం అమ్మకాలు: రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన కోటప్పకొండ తిరునాళ్ల వేడుకల్లో యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జరిగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారు. పల్నాడుజిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి చెప్పిన విధంగా తిరునాళ్ల వేడుకల్లో కోటప్పకొండ, దిగువ ప్రాంతాలలో ఎక్కడా మద్యం అమ్మకాలు నిర్వహించకూడదు. కానీ ఆ మాటలు బేఖాతరు చేస్తూ కోటప్పకొండ దిగువన ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం పక్కన ఉన్న దాబా హోటల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. అధికారులు మద్యం అక్రమ అమ్మకాలు జోరుగా జరుగుతున్నా అధికారులు వాటిపై దృష్టి సారించకపోవడంపై ప్రజల్లో పలు విమర్శలకు తావిస్తోంది.

కారు ఢీకొని ఓ యువకుడు మృతి: రాష్ట్రీయ రహదారిపై దాచేపల్లి పాత బస్టాండు సెంటర్లో కారు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. బస్టాండు కూడలిలో రోడ్డుపై వెళ్తున్న గుంజా నరసింహా రావు (28)ను పిడుగురాళ్ల నుంచి మిర్యాలగూడ వైపు వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకుని బోరున వెలవెలలాడారు అనంతరం వారు ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి వరకు నిరసన కొనసాగింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహంతో బంధువులు అర్ధరాత్రి రెండు గంటల వరకు ఆందోళన చేశారు. భారీ సంఖ్యలో ట్రాఫిక్ జాము కావడంతో ప్రజల అవస్థలు పడ్డారు.

పల్నాడులో కోడి పందెం జోరు...పట్టించుకోని పోలీసులు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.