Clash between two TDP factions: పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సత్తెనపల్లి పార్టీ సంస్థాగత కమిటీల నియామకం కోసం తెదేపా నేతలు నక్కా ఆనంద బాబు, జీవీ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్ర, డోలా బాలావీరాంజనేయ స్వామి,.. నియోజకవర్గ పరిశీలకులు గన్నే వెంకట నారాయణ ప్రసాద్‌లు పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని.. ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. దీంతో పార్టీ సంస్థాగత నియామకాలు రసాభాసగా మారాయి. వేరే నియోజకవర్గ తెదేపా నాయకులు నియామక కార్యక్రమానికి వచ్చారని.. కోడెల వర్గం ఆరోపించింది. స్థానిక నియోజకవర్గం నేతల పెత్తనమే ఇక్కడ కొనసాగాలని జీవీ ఆంజనేయులు వద్ద కోడెల శివరాం డిమాండ్ చేశారు. ఘటనతో కమిటీ సమావేశం నుంచి మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు వెళ్లిపోయారు.
ఇవీ చదవండి: