ETV Bharat / state

Bike stunts ప్రాణాలు తీస్తున్న సరదాలు.. యువతకు వ్యసనంగా మారుతున్న బైక్‌ విన్యాసాలు - AP Latest News

Youth doing dangerous stunts on bikes బెజవాడలో బైక్‌పై విన్యాసాలు చేసే యువత.. పెరిగిపోతున్నారు. ఖాళీగా ఉన్న రోడ్డను చూస్తే చాలు చేతులు వదిలేసి బైక్‌లు నడపడం, బైక్‌లపై నిల్చొని ప్రయాణిస్తు ఒళ్లు గగుర్పొడిచేలా విన్యాసాలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో లైకులు, వ్యూస్ కోసం కొందరు ఈ తరహా స్టంట్లు చేస్తుంటే మరికొందరు సినిమా నటులను చూసి విన్యాసాలు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.

ప్రాణాలు తీస్తున్న సరదాలు.. యువతకు వ్యసనంగా మారుతున్న బైక్‌ విన్యాసాలు
Youth doing dangerous stunts on bikes
author img

By

Published : May 25, 2023, 2:55 PM IST

Youth doing dangerous stunts on bikes విజయవాడ నగరం, శివార్లలోని పలు ప్రాంతాల్లో యువత ద్విచక్ర వాహనాలపై ప్రమాదకర విన్యాసాలతో హడలెత్తిస్తున్నారు. బైక్‌లపై నిలబడి.. కాలు పైకి లేపి.. రెండు చేతులూ వదిలేసి.. రోడ్లపై ఫీట్లు చేస్తున్నారు. విశాలంగా, జనసంచారం తక్కువగా ఉన్న రహదారులను వీటి కోసం ఎంచుకుంటున్నారు. వీటిని వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లోని తమ వ్యక్తిగత ఖాతాల్లో పోస్టు చేస్తున్నారు. ఇలా ప్రమాదకంగా వాహనం నడుపుతున్న ఓ యువతిని ఇటీవలే ట్రాఫిక్‌ పోలీసులు పిలిచి జరిమానా విధించి హెచ్చరించి పంపారు. ఈ తరహా ఫీట్లలో ఎక్కువ శాతం ప్రాణాంతకంగా మారుతున్నాయి. పోలీసులు మరింత సమర్థంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఇవి సూచిస్తున్నాయి.

యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం.. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్‌బుక్, తదితర వాటి ద్వారా తమ నిత్య జీవితానికి సంబంధించి పలు అంశాలను చిత్రాలు, దృశ్యాల రూపంలో ఇతరులతో పంచుకుంటున్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రమాదకరంగా విన్యాసాలు చేసి రీల్స్, షార్ట్స్‌ రూపంలో సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తున్నారు. వీటికోసం రద్దీ లేని ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై కంకిపాడు, ఉయ్యూరు, తదితర చోట్లా ఇటువంటి జరుగుతున్నాయి.

తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే విన్యాసాలు.. ఈ తరహా సంస్కృతి యువతలో పెరిగిపోతోంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే విన్యాసాలు చేసే యువత రెచ్చిపోతున్నారని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. మైనర్లు ఇలాంటివి చేస్తే.. తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచిస్తున్నారు. పోలీసులు కూడా సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూసిన వాటిపైనే స్పందిస్తున్నారు తప్ప.. పకడ్బంధీ నిఘాతో అరికట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

యువతికి రెండుసార్లు జరిమానా.. విజయవాడ నగరానికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థినికి తన సోదరుడి బుల్లెట్‌ బండి తీసుకుని కనకదుర్గ వంతెనపై చేతులు వదిలేసి నడుపుతూ వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో పోస్ట్‌ చేసింది. దీనిపై ఓ వ్యక్తి వీడియోలను విజయవాడ నగర పోలీసులకు ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్టు చేశారు. పోలీసులు స్పందించి.. ఆ యువతిని పిలిచి కౌన్సెలింగ్‌ నిర్వహించి.. ఆ వాహనాలపై జరిమానాలు విధించారు. గత వారం మళ్లీ ఈ వీడియోలను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. దీనిపై ట్విటర్‌లో పోలీసులకు ఫిర్యాదు రావడంతో నగర ట్రాఫిక్‌ పోలీసులు పిలిచి జరిమానా విధించి హెచ్చరించారు. ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు యువతి స్టేషన్​కు వెళ్లింది.

ఒకరు మృతి మరొకరు మంచానికే పరిమితం.. ఉయ్యూరు పట్టణానికి చెందిన గౌరీ సాయికృష్ణ బైక్‌పై స్టంట్లు చేస్తూ ఏడు నెలల క్రితం చనిపోయాడు. పమిడిముక్కల మండలం మంటాడ సర్వీసు రోడ్డులో వేగంగా వెళ్తున్న బైక్‌పై నిలబడి విన్యాసాలు చేస్తూ అదుపు తప్పి సాయికృష్ణ ప్రమాదానికి గురై, తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. పట్టణంలోని ఫకీర్‌గూడెం ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల ఖాజాకు కనకదుర్గ వంతెనపై స్పోర్ట్స్‌ బైక్‌తో ఫీట్లు చేస్తూ ప్రమాదానికి గురై మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది.

వాహన చట్టంలోని పలు సెక్షన్లు.. ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారికి మోటారు వాహన చట్టంలోని పలు సెక్షన్ల కింద జరిమానాలు, శిక్షలు విధించే అవకాశం ఉంది. వీటిని గుర్తెరిగి యువత మసలుకోవాలి. ప్రమాదకరంగా, అతివేగంగా వాహనం నడుపుతూ ఇతరులకు ఇబ్బందులు కలిగించే వారిపై సెక్షన్ 184 కింద కేసు నమోదు చేస్తారు. దీని ప్రకారం రూ వెయ్యి జరిమానా, మొదటి సారి అయితే ఆరు నెలల వరకు జైలు శిక్ష పడుతుంది. అదే తప్పు మళ్లీ చేస్తే.. రూ. 2 వేలు వరకు జరిమానా లేక రెండేళ్ల వరకు జైలు లేదా రెండూ విధించవచ్చు. సెక్షన్‌ 189 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో వాహనాలతో రేసులు నిర్వహిస్తే రూ. 500 జరిమానా లేదా మూడు నెలల జైలు లేదా రెండూ విధించవచ్చు. తిరిగి ఇదే నేరానికి పాల్పడితే.. ఏడాది జైలు లేదా రూ. 10 వేలు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. భద్రత లేని పరిస్థితుల్లో వాహనాలను బహిరంగ ప్రదేశాల్లో వినియోగించిన వ్యక్తికి సెక్షన్ 190 ప్రకారం రూ. 1,500 జరిమానా వేస్తారు. ఎదుటి వ్యక్తికి గాయాలు చేసి, ఆస్తి నష్టానికి పాల్పడితే రూ. 5వేలు వరకు జరిమానా, మూడు నెలల వరకు జైలు శిక్ష పడుతుంది.

ప్రాణాలు తీస్తున్న సరదాలు.. యువతకు వ్యసనంగా మారుతున్న బైక్‌ విన్యాసాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.