Sankranti holidays: పిల్లలకు సంక్రాంతి సెలవులొచ్చాయి. సెలవులు ఆనందంగా గడపాలంటే మెుబైల్ గేమ్స్ ఒకటే కాదండి చాలా ఉన్నాయి. అవి ఆడడం వల్ల మానసిక ఆనందంతో పాటు చురుకుదనం కూడా అలవడుతుంది. అవి ఎంటో కొత్త రకం ఆటలు అనుకొంటున్నారా కాదండోయ్! అందరికి తెలిసినవే వాటిని ప్రస్తుత బిజీ ప్రపంచంలో పడి మరిచిపోయి ఉంటారు. మరి అవేంటో తెలుసుకోవాలని ఉందా..వాటిని మీరు తెలుసుకొని పిల్లలతో చేయమని చెప్పడం వలన వారు ఉత్సహంగా పాల్గొంటారు. పండగ పనులు మీరు ఆనందంగా చేసుకోవచ్చు. వీటినీ మామూలు వాటిల్లా టీవీ, వీడియో గేములు ఆడటానికే పరిమితం చేస్తే ఎలా? పండగ గురించి తెలియజేస్తూనే.. సృజనాత్మకతకు పనిచెప్పేలా చేయండిలా..
- సంక్రాంతిని ప్రతిబింబించేలా బొమ్మలు గీయమనండి. చిన్నపిల్లలు.. తెలియదు అన్నారా.. ఫర్లేదు! భోగి మంటలు, సంక్రాంతి వేడుకలో కనిపించే భోగి కుండ, గాలిపటాలు, చెరకు గడలు, ముగ్గుల గురించి చెప్పి, గీయమనండి. మొబైల్, సిస్టమ్‌లో ఉదాహరణలు చూపిస్తే.. చక్కగా ప్రయత్నిస్తారు. ఊరికే వాళ్లకి మాత్రం ఏం ఆసక్తి ఉంటుంది? అందంగా గీస్తే వాటిని ఇంట్లో అలంకరిద్దామని చెప్పండి.. ఉత్సాహంగా ప్రయత్నిస్తారు.
- కొంచెం పెద్ద పిల్లలనుకోండి.. అట్టపెట్టలు, క్లే, పేపర్లతో క్రాఫ్ట్‌లు చేయమనండి. సొంతంగా గాలి పటాలనూ ప్రయత్నించమనొచ్చు. పూలు, రంగుల కాగితాలతో గుమ్మాలను అలంకరించడం వంటివీ చెప్పొచ్చు. అవి ఎలా ఉన్నా.. మీరు నవ్వద్దు, ఏమీ వ్యాఖ్యానించొద్దు. అప్పుడే వాళ్లకీ ఆనందం.. ఇంకోసారి భిన్నంగా ప్రయత్నించడానికి ఆసక్తి చూపుతారు. కావాలంటే.. ‘ఇది బాగుంది.. ఇంకొంచెం అందంగా చేద్దా’మని మీ ఆలోచనలనీ జోడిస్తే కలిసి చేయడం తెలుస్తుంది. దాన్ని ఇంట్లో అందరికీ కనిపించే చోట పెడితే సరి.
- పండగంటేనే పిండి వంటలు.. ఎంతసేపూ మీరు చేయడమేనా! ఈసారి వాళ్లకీ అవకాశ మివ్వండి. పెద్దవే అవసరం లేదు. లడ్డూలు చుట్టడం, ఉండలు చేయడం.. లాంటి చిన్న చిన్న పనులు అప్పగించండి. పనిలో ఉన్న కష్టం తెలుస్తుంది. తీరా వాళ్లు చేసింది నచ్చలేదు అంటే ఎంత బాధో అర్థమవుతుంది. తినేటప్పుడు పేచీలు పెట్టకూడదన్నదీ గమనిస్తారు.
- స్నేహితులకు పండగ శుభాకాంక్షలు చెబుతాం. పిల్లల్నీ ప్రోత్సహించండి. అయితే ఫోను, మెసేజ్‌లకే పరిమితం చేయొద్దు. రంగుల కాగితాలిచ్చి చిన్న ముగ్గులు, బొమ్మలతో శుభాకాంక్షలు రాసి, చిన్న చిన్న గ్రీటింగులు చేయమనండి. వాటిని వాళ్లతోనే ఇప్పించండి.. ఇచ్చిన పిల్లలకీ, అందుకున్న వాళ్లకీ ఓ అందమైన జ్ఞాపకమవుతుంది.
ఇవీ చదవండి: