ETV Bharat / state

అరకు, మారేడుమిల్లిలో ఉత్సవాలు - ఆ వస్తువులపై నిషేధం విధించిన ప్రభుత్వం - ARAKU UTSAV

ఐదేళ్ల తర్వాత అరకు ఉత్సవ్ పునఃప్రారంభం - ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు

Araku_Utsav
Araku Utsav (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 17 hours ago

Updated : 12 hours ago

Araku Utsav : వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో పర్యాటక రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏటా నిర్వహించే అరకు ఉత్సవ్‌ని జగన్‌ సర్కారు పక్కన పెట్టేసింది. దీంతో అరకు సందర్శనకు వచ్చే పర్యాటకుల్లో కొంతమేర జోష్‌ కొరవడింది. కూటమి ప్రభుత్వం రాకతో పర్యాటకానికి మళ్లీ మంచి రోజులొచ్చాయి. వచ్చే నెలాఖరులో మూడు రోజులపాటు అరకు ఉత్సవ్‌ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో స్థానికులు, సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మూడు రోజుల పాటు ధూంధాం: గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అరకు ఉత్సవ్‌ని ప్రారంభించారు. ఐదేళ్లపాటు ఈ కార్యక్రమం నిరాటంకంగా జరిగింది. 3 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సంప్రదాయాలూ ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఉండేవి. శ్రీకాకుళం సవర, అరకు ప్రాంతంలోని థింసా, కొమ్ముబూర, కోయ నృత్య ప్రదర్శనలు, పులి వేషాలు, స్ట్రీట్ డ్యాన్స్‌లు ఏర్పాటు చేసేవారు. స్థానిక కళాకారులు, విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేలా వివిధ అంశాల్లో స్కూల్, కాలేజీ లెవల్లో పోటీలు నిర్వహించేవారు. మూడు రోజులపాటు అరకులోయ ప్రధాన రహదారి, పర్యాటక ప్రాంతాలు విద్యుద్దీపాల కాంతులతో మెరిసిపోయేవి.

"కళ్ల ముందే బాహుబలి మంచుకొండలు'' - అరకు కాఫీ తాగుతూ నేరుగా ఆ అందాలను వీక్షించాల్సిందే!

పర్యాటకుల్లో నూతన జోష్‌: ఐదేళ్ల తర్వాత అరకు ఉత్సవ్‌ని నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అరకులోయ పర్యాటకుల్లో కొత్త జోష్‌ నెలకొంది. ఉత్సవ్‌లో భాగంగా హాట్‌ ఎయిర్‌బెలూన్, సాంస్కృతిక కార్యక్రమాలు, రంగోలి పోటీలు, ఆటలు, నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం అరకులో పర్యాటక సీజన్‌ నడుస్తోంది. ఇప్పటికే వారాంతంలో టూరిస్టులు అరకులోయకు పోటెత్తుతున్నారు. అరకు ఉత్సవ్‌తో అరకు లోయకు మరింత ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల సంఖ్య పెరిగితే తమ వ్యాపారాలు బాగుంటాయని అంటున్నారు.

సందడే సందడి: జనవరి 31 నుంచి మూడు రోజులపాటు అరకు ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. గురువారం కలెక్టర్‌ ఛాంబర్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన పర్యాటక అభివృద్ధిపై జరిగిన సమీక్ష నిర్వహించారు. మారేడుమిల్లి ఉత్సవాలు ఫిబ్రవరి 23 నుంచి 25వ తేదీ వరకు మారేడుమిల్లిలో నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. అరకు, బొర్రాగుహలను ప్లాస్టిక్‌ ఫ్రీ డెస్టినేషన్‌గా ప్రకటించినట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో ఎటువంటి ప్లాస్టిక్‌ నీటి సీసాలైనా నిషేధించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాలను సందర్శించే టూరిస్టులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. అరకు, మారేడుమిల్లి ఉత్సవ్‌ల నిర్వహణకు మూడు కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు.

పర్యాటకులకు పండగే - అరకు సందర్శకులకు ప్రత్యేక రైళ్లు

మంచువేళల్లో అరకు అందాలు - తెలంగాణ టూరిజం అద్దిరిపోయే ప్యాకేజీ!

Last Updated : 12 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.