ETV Bharat / state

ప్రమాదాలు ఇక్కడ, ఆస్పత్రి ఎక్కడ? - దినదిన గండంలా ఆటోనగర్ కార్మికుల పరిస్థితి

Vijayawada Auto Nagar Labor Problems: విజయవాడలోని ఆటోనగర్​లో ప్రభుత్వ ఆసుపత్రి లేక కార్మికులు అనేక రకాలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. నిత్యం ప్రమాదాల నడుమ బతుకీడుస్తున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రభుత్వాసుపత్రి నిర్మించాలని ఆటోనగర్​ కార్మికులు కోరుతున్నారు.

vijayawada_auto_nagar_labor_problems
vijayawada_auto_nagar_labor_problems
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 10, 2024, 12:47 PM IST

Vijayawada Auto Nagar Labor Problems: వేల మంది కార్మికులకు ఉపాధినిస్తోంది ఆ ఆటోనగర్‌. నిత్యం ప్రమాదాలతో సహవాసం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. భారీ ఇనుప వస్తువులను మరమ్మతు చేసేవారికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రమాదాలు జరిగినప్పుడు వైద్యసాయం కోసం ఎక్కడికి వెళ్లాలో అర్థం కానీ పరిస్థితి. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్దామంటే అక్కడ ఫీజులకు భయపడుతున్నారు. విజయవాడ ఆటోనగర్‌లో ప్రభుత్వ ఆస్పత్రి లేక కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఆటోనగర్​: విజయవాడ ఆటోనగర్‌లో సుమారుగా 80వేల నుంచి లక్ష మంది వరకు కార్మికులు పని చేస్తుంటారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల యూనిట్లు 3 వేల వరకు ఉంటాయి. లారీలు, బస్సుల బాడీ బిల్డింగ్, వెల్డింగ్, టింకరింగ్, రిటైంరింగ్, ఫౌండ్రీ వంటి పనులు చేస్తుంటారు. నిత్యం కార్మికులు ఏదోవిధంగా ప్రమాదాల బారిన పడుతుంటారు. సిలిండర్లు పేలడం, డీజిల్ ట్యాంకులకు మంటలు అంటుకుని కార్మికులు గాయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.

ఫ్లాట్లు ఇచ్చారు, పాట్లు మిగిల్చారు - ఆటోనగర్ అంటేనే భయపడుతున్న వాహనదారులు

ప్రమాదాలకు గురైతే అప్పులు చేయాల్సి వస్తోంది : ప్రమాదాలు జరిగినప్పుడు దగ్గర్లో ఆస్పత్రి సదుపాయం లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రోజువారీ కూలి పనులు చేసుకునే కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కూలి పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నామని, వైద్య ఖర్చులు తలకు మించిన భారంలా మారాయని వాపోతున్నారు.

ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యానికి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యానికి అందినకాడికి అప్పులు చేసి, మళ్లీ ఆ అప్పులు తీర్చడానికే కూలి డబ్బులు సరిపోతున్నాయని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రిని ఏర్పాటు చేసి ఆదుకోవాలని కార్మికులు వేడుకుంటున్నారు.

సమస్యల సవాళ్లతో ఆటోనగర్​ విలవిల - రోజు గడవడం లేదంటూ మెకానిక్​ల ఆవేదన

1966లో విజయవాడలో ఆటోనగర్ ఏర్పాటైన దగ్గర నుంచీ ఇక్కడ ప్రభుత్వ వైద్యశాల లేదు. ప్రభుత్వాలు, అధికారులు మారినా వైద్యం కోసం కార్మికులకు నిరీక్షణ తప్పడం లేదు. కనీస వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కార్మికులు, యూనియన్ల నాయకులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వపరంగా వైద్య సదుపాయం అందడం లేదు. నిత్యం ప్రమాదాలతో సావాసం చేసే తమకు ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ఆటోనగర్ కార్మికులు వేడుకుంటున్నారు.

Lack of Facilities in Autonagar: ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్నా.. కనీస వసతులకు నోచుకోక అల్లాడుతున్న ఆటోనగర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.