ETV Bharat / state

అలాంటి మానవ మృగాళ్లను ఉపేక్షించబోం.. కఠిన చర్యలు తీసుకుంటాం: వాసిరెడ్డి - తిరువూరు ఘటనపై వాసిరెడ్డి పద్మ కామెంట్స్

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వాలంటీర్‌ భర్త చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాలిక కుటుంబ సభ్యులను.. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే మానవ మృగాళ్లను ఉపేక్షించేది లేదని.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

వాసిరెడ్డి
వాసిరెడ్డి
author img

By

Published : Apr 25, 2022, 6:21 PM IST

అలాంటి మానవ మృగాళ్లను ఉపేక్షించబోం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో... వాలంటీర్‌ భర్త చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాలిక కుటుంబ సభ్యులను.. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. బాధితురాలికి అండగా ఉండటమే కాకుండా.. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే మానవ మృగాళ్లను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

తెదేపా ఆందోళన: బాలిక బాత్రుంలో స్నానం చేస్తుండగా వీడియో తీసిన వాలంటీర్ భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా డిమాండ్‌ చేసింది. తిరువూరులో బాధిత కుటుంబాన్ని ఆ పార్టీ నేతలు పరామర్శించారు. బాధితురాలికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యం వలనే రాష్ట్రంలో బాలికలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని నేతలు ఆరోపించారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పర్యటనను వ్యతిరేకిస్తూ.. తెలుగుదేశం నేతలు ఆందోళన నిర్వహించారు.

ఏం జరిగిందంటే..?: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఇంటర్ చదువుతున్న బాలిక స్నానం చేస్తుండగా.. వాలంటీర్ భర్త వీడియోలు తీసి వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు తిరువూరు పోలీసులను ఆశ్రయించింది. అధికార పార్టీ నేతలు చేసిన రాజీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. తనను వేధించిన వ్యక్తికి శిక్ష పడాల్సిందేనంటూ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాలంటీర్‌ భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: పల్నాడు జిల్లాలో దారుణం.. ఐదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.