Vaikunta Ekadashi Celebrations in Andhra Pradesh : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలో వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించుకునేందుకు దేవాలయాల్లో బారులు తీరారు. కాకినాడ జిల్లాలో అన్నవరం సత్యనారాయణ స్వామి వారు అలంకరణ వైభవంతో భక్తులకు దర్శనిమిచ్చారు. విజయనగరం జిల్లాలో పలు పలుప్రాంతాల్లో వెలిసిన స్వామి వారి ఆలయాల్లో భక్తులు ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. కోనసీమ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో స్వామి ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
అయోమయంలో వైకుంఠ ద్వార దర్శనం.. టీటీడీ నిర్ణయాలతో భక్తుల అవస్థలు
Vaikunta Ekadasi Celebrations In Vijayawada : తూర్పు గోదావరి జిల్లా , ఉండ్రాజవరంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం వైపు ప్రవేశించి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ కావటంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని స్వామి వారి దర్శనం చేసుకున్నారు. విశాఖ, సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో భక్తులు స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి విశేష పూజలు చేశారు.
తెలంగాణలో వైకుంఠ వైభవం.. పారవశ్యంలో భక్తజనం
Vaikunta Ekadasi 2023 : గుంటూరు, బాపట్ల జిల్లాలోని పలు మండల్లాలో వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైష్ణవ దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంబరాన్ని అంటాయి. శ్రీ భూనీల సమేత రంగనాయకుల స్వామి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కోసం భక్తులకు పడిగాపులు తప్పలేదు. నెల్లూరులో తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. రాత్రి నుంచే భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో చేరుకుని పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నంద్యాలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకున్నారు.
వైకుంఠ ఏకాదశి.. ప్రముఖులు స్వయంగా వస్తేనే దర్శన టికెట్లు: తితిదే ఈవో
Vaikunta Ekadasi in Srisaulam : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadasi) మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను శోభాయమానంగా ముస్తాబు చేసి వేదమంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. భక్త జనం స్వామి వారి దివ్యమంగళ వైభవాన్ని దర్శించుకున్నారు. ఆలయాల్లో భక్తుల రద్దీతో దైవదర్శనానికి భక్తజనం బారులు తీరారు. ప్రత్యక పూజలు, దీపారాధనలో ఆలయాలు దైవ నామ స్మరణతో మారుమోగుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా కుటుంబ సమేతంగా స్వామి దర్శనాలు చేసుకుంటుంన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం.. పోటెత్తిన భక్తజనం