Schemes For Dalits:) వైకాపా అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలను రద్దు చేసిందని ఆ వర్గాలకు చెందిన నేతలు మండిపడ్డారు. విజయవాడలో విశ్రాంత ఐఏఎస్. గోపాలరావు అధ్యక్షతన నిర్వహించిన దళిత, గిరిజన ఐకాస రాష్ట్ర సదస్సుకు.. పలు పార్టీల నేతలు హాజరయ్యారు. రద్దు చేసిన పథకాలను వెంటనే పునరుద్ధరించాలని వక్తలు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను పక్కదారి పట్టించి వైకాపా ప్రభుత్వం ఆయా వర్గాలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. ప్రభుత్వం తప్పును సరిదిద్దుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.
ఇవీ చదవండి