ETV Bharat / state

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు - half day schools

10th Class Examinations : రాష్ట్రంలో నేటి నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితమని తెలిపారు. మరోవైపు నేటినుంటి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల్లో మాత్రం సెలవు ప్రకటించారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 3, 2023, 7:20 AM IST

AP 10th Class Examinations : రాష్ట్రంలో నేటి నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్దకు పరీక్ష సమయం కంటే ముందే చేరుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒక్క నిమిషం అలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది.

ఆరు పేపర్ల విధానంలోనే పరీక్షలు : నేటి నుంచి నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 వరకు వరకు పరీక్షలు జరుగనున్నాయని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షలను 6 పేపర్ల విధానంలోనే నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3349 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తుండగా.. దాదాపు 6 లక్షల 9 వేల 70 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

ఉచిత బస్సు ప్రయాణం : పరీక్షలకు హాజరు అవుతున్న వారిలో 3 లక్షల 11 వేల 329 బాలురు ఉండగా.. 2 లక్షల 97 వేల 741 మంది బాలికలు ఉన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారు 53వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు మాత్రం మధ్యాహ్నం నుంచి ఉంటాయని అధికారులు తెలిపారు. పరీక్షలు నిర్వహిస్తున్న రోజుల్లో విద్యార్థులకు హాల్ టికెట్ ఆధారంగా.. ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

నేటి నుంచి ఒంటి పూట బడులు : ఈ రోజు నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న 3 వేల 349 పాఠశాలలకు రెండుపూటలా సెలవులు ఇవ్వనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా విద్యార్థులను పరీక్షకు అనుమతించేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రత్యేక కారణాలు ఏమైనా ఉంటే తప్ప.. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరాదని అధికారులు నిర్ణయించారు. పరీక్షా కేంద్రాలాలోకి సెల్​ఫోన్లను ఇతర ఎలక్ట్రానిక్​ వస్తువులకు అనుమతి లేదని తెలిపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.