NTR 100 Years Celebrations: రజనీకాంత్‌పై వైసీపీ నేతలు చేసిన విమర్శలకు తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. రజనీకాంత్ రాజకీయాలు మాట్లాడలేదు,.. ఆయన మీద పడి వైసీపీ నేతలు ఎందుకు ఏడుస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు విజన్ గురించి.. ఎన్టీఆర్ గురించి రజనీకాంత్ మాట్లాడితే వైసీపీ నేతలకేమైందని నిలదీశారు. చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల కాళ్లు పట్టుకున్న వాళ్లా మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రోజా చంద్రబాబు గురించి ఏం మాట్లాడారో చూసుకోవాలని హితవు పలికారు.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు చేసుకుంటే వైసీపీకి ఎందుకు కడుపు మంట అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. రజనీకాంత్ మీద ఉదయం నుంచే మాట్లాడుతున్నారని నేతలు మండిపడ్డారు. రజనీకాంత్ మీద విమర్శలు చేశారంటే.. నిన్నటి సభ ఎంత సక్సెస్ అయ్యిందో అర్థమైందన్నారు. రోజా ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఇరవై ఏళ్ల క్రితం చంద్రబాబు విజన్.. మేధో సంపత్తి గురించి ఇదే రోజా మాట్లాడారని గుర్తు చేశారు. రజనీకాంత్ పైనా విమర్శలు చేస్తున్నారంటే వైసీపీ భజన బృందం మైండ్ చిప్‌లు పోయాయని మండిపడ్డారు. రజనీ ఆరోగ్యం గురించి కూడా వైసీపీ నేతలు మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. రోజాలాంటి చంద్రముఖిలను తొక్కి తొక్కి రజనీకాంత్ బయటకొచ్చారన్నారు. బాబాయిని హత్య చేసినవాళ్లు కూడా వెన్నుపోటు గురించి మాట్లాడేవారా అంటూ మండిపడ్డారు. కొడాలి నాని కడుపుకు అన్నమే తింటున్నారా అంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు వచ్చిన రజినీకాంత్ ఎన్టీఆర్, చంద్రబాబు గురించి మట్లాడితే, వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు సమాజం హర్షించే విధంగా లేవు. చంద్రబాబు విజన్‌పై రజినీకాంత్ మాట్లాడితే ఆయనను విమర్శిస్తున్నారు. రోజా టీడీపీలో ఉన్న సమయంలో చంద్రబాబును గురించి గొప్పగా చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. జగన్ చెప్పాడనే ఇప్పుడు ఆయను విమర్శిస్తున్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు అంటున్నారు. సీఎం సీటు సొంత బాబాయినే వెన్నుపోటు పొడిచింది ఎవరో చెప్పాలి. -వంగలపూడి అనిత, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలు.
తెలుగు దేశంలో ఉండగా... చంద్రబాబు కాళ్లు పట్టుకొని బతికిన రోజా ఇప్పుడు ఆయనపై నోరు పారేసుకుంటోంది. చంద్రబాబును గురించి మాట్లాడే ముందు సంస్కారం ఉండాలి. సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ఎన్టీఆర్, చంద్రబాబు గురించి మాట్లాడితే ఆయనపై విరుచుకు పడుతున్నారు. జగన్ చెప్పారనే రజినీకాంత్ ను విమర్శించారు. 6093 అనే నెంబర్ గూగుల్ లో కొడితే జగన్ చరిత్ర ఎంటో తెలుస్తోంది. వైసీపీ నేతల గురించి సుప్రీం కోర్టు సైతం విమర్శలు చేన విషయం గుర్తుంచుకోవాలి. -సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు
ఇవీచదవండి: