ETV Bharat / state

అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటులో వందల కోట్ల రూపాయల దోపిడీ: టీడీపీ నేతలు - విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం

TDP Leaders Fires on YSRCP Government: విజయవాజలో ఈ నెల 19న అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు అంబేడ్కర్‌ స్మృతి వనాన్ని పరిశీలించారు. అంబేడ్కర్ పేరు అడ్డం పెట్టుకుని వందల కోట్ల రూపాయల దోపిడీకి ప్రభుత్వం తెర లేపిందని నేతలు ఆరోపించారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు మోసం చేశారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు.

TDP_Leaders_Fires_on_YSRCP_Government
TDP_Leaders_Fires_on_YSRCP_Government
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 17, 2024, 4:03 PM IST

అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటులో వందల కోట్ల రూపాయల దోపిడీ : టీడీపీ నేతలు

TDP Leaders Fires on YSRCP Government : అంబేడ్కర్ పేరు అడ్డంపెట్టుకుని వందల కోట్ల రూపాయల దోపిడీకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెర లేపిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. హైదరాబాద్​లో 150 కోట్ల రూపాయలతో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటైతే, అలాంటి విగ్రహానికే ఏపీలో రూ. 400 కోట్లు ఖర్చు చూపటం దోపిడీ కాక మరేంటనీ నిలదీశారు. తెలుగుదేశం ప్రభుత్వం రూ.137 కోట్లతో 125 అడుగుల ఎత్తు విగ్రహంతో నిర్మించ తలపెట్టిన స్మృతి వనాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. 36 కోట్లతో 26శాతం పనులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిందని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టు కంటే చిన్న ప్రాజెక్టు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టి 400 కోట్ల ఖర్చు చూపెట్టడమేంటనీ ప్రశ్నించారు. ప్రభుత్వ కనుసన్నుల్లోనే అంబేడ్కర్ విగ్రహాలు దోపిడీకి గురయ్యాయని ఆక్షేపించారు.

విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు ఖరారైన మహూర్తం

Ambedkar Statue Built in Vijayawada to Cost Rs 400 Crore : అమరావతిని చంపినట్లే అంబేడ్కర్ స్మృతి వనాన్ని జగన్ చంపేశారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. గత 5 ఏళ్లలో దళితుల పట్ల జగన్ చేసిన పాపాలు ఎప్పటికీ పోవని మండిపడ్డారు. అంబేడ్కర్, ఆయన రాసిన రాజ్యాంగంపైనా ఏ మాత్రం చిత్తశుద్ధి, గౌరవం లేని ముఖ్యమంత్రి జగన్ రెడ్డేనని దుయ్యబట్టారు. శాఖమూరులో అంబేడ్కర్ స్మృతి వనం ప్రాజెక్టును తెలుగుదేశం దళిత నేతలు పరిశీలించారు. దొంగలించబడిన విగ్రహాలు, స్మృతి వనం ప్రాజెక్టు నిర్వీర్యం ప్రాంతాలను నేతలు పరిశీలించారు.

పొలాల్లో అంబేడ్కర్ విగ్రహాం- సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు

ఈ నెల 19న అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ : విధానపరమైన విలువలకు బాబా సాహెబ్ బీఆర్ అంబేడ్కర్ పునాదులు వేశారని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. ఆయన బాటలోనే ప్రభుత్వం విధానాలను రూపొందించుకుని అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన అంబేడ్కర్ సామాజిక సమ్మేళనం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సామాజిక న్యాయశిల్పంగా నిర్మించిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరిస్తారని మంత్రి వెల్లడించారు.

అంబేడ్కర్ సూచించిన మార్గంలో విధానాల రూపకల్పన చేస్తున్న వైసీపీ ప్రభుత్వం పేదరికం విద్యకు అడ్డు కాకూడదన్న లక్ష్యంతో పని చేస్తున్నట్టు తెలిపారు. జగన్ ప్రభుత్వ హయాంలో సామాజిక న్యాయం, సామాజిక సాధికారత జరిగాయన్నారు. చిట్టచివరి కుటుంబానికి కూడా సంక్షేమం అందేలా కార్యాచరణ చేపట్టామని మంత్రి తెలిపారు.

చంద్రబాబు మోసం చేశారు : రాష్ట్రంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు మోసం చేశారని మరో మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం ముళ్లకంపల్లో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైందని విమర్శించారు. అంబేడ్కర్ రాజ్యాంగం దేశంలో అసమానతలు రూపుమమాపేందుకు ప్రయత్నిస్తే జగన్ ఆ భావజాలాన్ని భుజానికి ఎత్తుకుని పరిపాలన చేస్తున్నారని మంత్రి అన్నారు.

జనవరి 19న విజయవాడలో అంబేడ్కర్​ విగ్రహావిష్కరణ - కలెక్టర్ల వీడియో కాన్పరెన్స్​లో సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.