ETV Bharat / state

నందిగామలో నేడు తెదేపా బాదుడే బాదుడు.. హాజరుకానున్న చంద్రబాబు - AP Politics

Chandara Babu Naidu: నందిగామలో నేడు జరగనున్న.. బాదుడే బాదుడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడంతో.. పార్టీ యంత్రాంగం మరింత ఉత్సాహంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Badude Badudu program
బాదుడే బాదుడు కార్యక్రమం
author img

By

Published : Nov 3, 2022, 7:29 PM IST

Updated : Nov 4, 2022, 6:41 AM IST

Chandara Babu Naidu: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నేడు జరగనున్న.. బాదుడే బాదుడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పార్టీ అధినేత ఈ కార్యక్రమానికి హాజరు కానున్న నేపధ్యంలో.. పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్థానిక గాంధీ సెంటర్​లో బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని ఆమె సందర్శించి.. తగిన సూచనలు చేశారు. నందిగామ మొత్తం పసుపుమయమైంది. చంద్రబాబు నాయుడు రోడ్ షో జరిగే రోడ్డు మార్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలు కట్టి స్వాగతం ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నందిగామకు చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు జిల్లా రాష్ట్ర నాయకులు ఘనంగా ఏర్పాటు చేశారు.

స్థానిక ముక్కపాటి కాలనీ నుంచి చంద్రబాబు నాయుడు రోడ్​ షో ప్రారంభం కానుంది.. ఎల్పీ సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం మీదుగా గాంధీ సెంటర్​కు చేరుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు నందిగామ గాంధీ సెంటర్లో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారు. అక్కడనుంచి ప్రధాన రోడ్డు మార్గంలో అనాసాగరం మీదుగా ఆయన తిరిగి జగ్గయ్యపేటలో జరిగే బాధుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొంటారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కోరారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 4, 2022, 6:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.