ETV Bharat / state

ఊపిరి తీసిన ఈత సరదా - మున్నేరు వాగులో ముగ్గురు మృతి, మరో ఇద్దరు గల్లంతు - ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం ప్రమాదం

several drowned
several drowned
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2023, 4:13 PM IST

Updated : Nov 13, 2023, 5:16 PM IST

15:59 November 13

మృతుల్లో ఒకరు ఎమ్మెల్యే కారు డ్రైవర్

several-drowned-to-death-munneru-river : ఎన్టీఆర్ జిల్లా నందిగామ కీసర మునేరు దగ్గర 8 మంది యువకులు ఈతకు వెళ్లారు. ఈతకు వెళ్లిన వారిలో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయిన్న వారిని గత ఈతగాళ్లు, పోలీసు వారి సహాయంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. వీరంతా ఐతవరం గ్రామానికి చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. గల్లంతయిన వారిలో ముగ్గురు మృతి చెందారు. చేజర్ల దినేష్, ఎడవల్లి గణేష్, గాలి సంతోష్ కుమార్ లు ముగ్గురు యువకులు మృతి చెందారని పోలీసులు తెలిపారు.

ఉద్యోగాలు, చదువుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారంతా... దీపావళి పండుగ కావడంతో సొంత గ్రామానికి వచ్చారు. గ్రామంలోని తమ మిత్రులను కలిశారు. అనంతరం 8 మంది యువకులు మున్నేరు వాగులో ఈతకు దిగారు. కాసేపటికే వారంతా నీటిలో మునిగిపోతుండడాన్ని చూసిన చుట్టుపక్కల వారు.. ఆ యువకులను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే ముగ్గురు నీటిలో మునిగిపోవడంతో వారిని చేరుకోలేకపోయారు. నీటిలో మునిగిపోతున్న మరో ముగ్గురిని ఒడ్డుకు తీసుకొచ్చారు. వెంటనే నందిగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

మృతులు చేజర్ల దినేష్, ఎడవల్లి గణేష్, గాలి సంతోష్ కుమార్​గా గుర్తించారు. డానివినీష్‌ ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ వద్ద డ్రైవరుగా ఎడవల్లి గణేష్ పనిచేస్తున్నారు. గాలి సంతోష్ కుమార్... బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. వారి మృతితో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. దండ రవికుమార్‌, ఎడవల్లి సిద్ధులకు మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు గత రెండు రోజులుగా మున్నేరులో నీటి ఉద్ధృతి పెరుగుతోంది. దీనికితోడు యువకులు నీట మునిగి ప్రాంతంలో ఇసుక కోసం తీసిన గుంటల్లో ఎక్కువ లోతులో ఉండడంతో- వారు అక్కడి ఊబిల్లో కూరుకుపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ముగ్గురి మృతితో ఐతవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Last Updated : Nov 13, 2023, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.