Sankata Chaturdashi celebrations on Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నూతన ఆర్జిత సేవగా... సంకటహర గణపతి హోమం ఏర్పాటు చేశారు. ప్రతినెల సంకట చతుర్దశి రోజున అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీగణపతి ఏకశిలా విగ్రహం వద్ద హోమం నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. ఇవాల్టి నుంచి సంకట హర గణపతి హోమం ఆర్జిత సేవగా ప్రారంభించారు. ప్రతిరోజు గణపతి హోమం ఆలయంలో జరుగుతున్నా... ప్రత్యేకంగా ఏకశిల గణపతి ఎదురుగా యాగశాలలో హోమం నిర్వహించే ఏర్పాటును తొలిసారిగా చేశారు.
భక్తులు ఆర్జితసేవగా వెయ్యి రూపాయల టిక్కెట్టు కొనుగోలు చేసి పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ హోమంలో ఆలయ పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ, స్థానాచార్యులు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ, పాలక మండలి సభ్యులు బుద్దా రాంబాబు, కట్టా సత్తయ్య, కేసరి నాగమణి తదితరులు పాల్గొన్నారు. గణపతి అభిషేకం, గణపతి మంత్ర హవనాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాధారణ భక్తులను కూడా హోమం తిలకించేందుకు అనుమతించారు. అనంతరం తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ హోమం చేయించుకున్న ఉభయదాతలకు శేషవస్త్రం, రవితోపాటు పెద్ద లడ్డూ, ఉండ్రాళ్లను ప్రసాదంగా అందజేస్తామని ఈవో భ్రమరాంబ తెలిపారు. ప్రత్యేక క్యూలైను మార్గం ద్వారా అమ్మవారి దర్శానికి అనుమతిస్తామన్నారు.
ఛైర్మన్, ఈవో మధ్య విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఒకరికొకరు ఎదురుపడినా మౌనంగానే ఎవరికి వారుగా మౌనం వహించారు. ఛైర్మన్ హోమం ప్రారంభంలో కాసేపు పాల్గొని.. ఆ తర్వాత తన ఛాంబరుకు వెళ్లిపోయారు. ఈవో ఆధ్యంతం హోమం ముగిసే వరకు ఉన్నారు. ఆ తర్వాత దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఉండడంతో హోమం పూర్తయిన తర్వాత అక్కడికి వెళ్లారు. దుర్గగుడి ఈవో భ్రమరాంబకు దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబుకు మధ్య పొసగడం లేదంటూ గత కొంత కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య దూరం పెరిగిట్లు వార్తలు వస్తున్నాయి.
సంకట హర చతుర్దశి సందర్భంగా నేటి నుంచి లక్ష్మీగణపతి ఏకశిలా విగ్రహం వద్ద పూజలు నిర్వహించడం ప్రారంభించాం. ప్రతినెల సంకట చతుర్దశి రోజున పూజా కార్యక్రమాలు జరిగేలా ఏర్పాట్లు చేశాం. అయితే ప్రతి రోజు కింద జరిగే ఈ హోమం.. నెలలో ఒక్క రోజు మాత్రం దుర్గగుడిపైన జరుగుతుంది. ఈ హోమం ద్వారా శూభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశాం. వైదిక కమిటీ వారితోపాటుగా అధికారులతో చర్చించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాబోయే రాజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు చేపడతాం. కర్నాటి రాంబాబు, దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్
ఇవీ చదవండి: