Sanitation Workers Strike in Andhra Pradesh : కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె నాలుగో రోజు కొనసాగింది. మున్సిపాలిటీ కార్యాలయాలు వద్ద కార్మికులు, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది ఆందోళన చేశారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు సమ్మె కొనసాగిస్తామని సృష్టం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు విపక్ష నేతలు మద్ధతు తెలిపారు.
మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె సైరన్ - ప్రభుత్వానికి హెచ్చరిక
Sanitation Workers Strike Various District : గుంటూరు జిల్లా మంగళగిరి నగరపాలక సంస్థ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులందరికీ సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పురపాలక కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ సిబ్బంది చేస్తున్న ఆందోళనకు సీపీఐ నాయకులు సంఘీభావం తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. కడప నగరపాలక కార్యాలయం ఎదుట కార్మికులు రోడ్లుపై బోర్లా పడుకొని రెండు చేతులతో నమస్కరిస్తూ నిరసన తెలిపారు. అనంతపురంలో మున్సిపల్, ఇంజనీరింగ్ కార్మికులు మెడకు ఉరితాళ్లు వేసుకొని ఆందోళన చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గంలోనూ కార్మికులు మెడకు ఉరితాళ్లు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు.
Garbage Piled Up in Cities : రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం అనుకూల నిర్ణయం తీసుకోకపోవటంతో నగరాలు, పట్టణాల్లోని ప్రజలు మురుగులో మగ్గిపోతున్నారు. ఎక్కడికక్కడ మురుగు, వ్యర్థాలు నిలిచిపోవటంతో నగర ప్రజలు పెద్దఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌర వాహనాలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో తొలగించే ప్రయత్నం చేయగా కార్మికులు వారిని అడ్డుకున్నారు.
డిమాండ్లు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికుల ధర్నా
Unresponsive Authoritarian Government : సమ్మె చేస్తున్న కార్మికులను ప్రభుత్వం పలు విధాలుగా బెదిరించేందుకు యత్నిస్తుండటంతో పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులు రెట్టింపు పట్టుదలతో సమస్యలపై వైసీపీ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. అధికారులు నగరంలో శాశ్వత ఉద్యోగులతో చెత్త తొలగించేందుకు యత్నించటాన్ని కార్మికులు అడ్డుకున్నారు. చెత్తను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకొని, రహదారి మధ్యలో చెత్తను అన్ లోడ్ చేయించారు. మున్సిపల్ కార్మికులు సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని పోరాడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించిన అధికార ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించే యోచనలో లేదని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. వారి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు.