ETV Bharat / state

Ramzan: రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. హాజరైన రాజకీయ నేతలు - Indira Gandhi Municipal Stadium

Ramzan celebrations: రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు జరుపుకున్నారు. ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలతో నెలరోజుల పాటు నియమనిష్టలతో గడిపిన ముస్లింలు నేడు రంజాన్‌ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. స్థానికంగా ఉన్న ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

Ramzan celebrations
Ramzan celebrations
author img

By

Published : Apr 22, 2023, 4:33 PM IST

Ramdan celebrations:రంజాన్​ పర్వదినాన్ని ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానికంగా ఉన్న ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో రంజాన్ వేడుకలు ఈద్గా​ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో వైసీపీ నాయకులు మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ సంపూర్ణంగా అవతరించిన రంజాన్‌ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారని వక్తలు పేర్కొన్నారు. ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు, దీక్షలు, ఆధ్యాత్మిక చింతన, దాన ధర్మాలు చేపట్టామని ముస్లిం పెద్దలు తెలిపారు. ధనవంతులు, పేదవాళ్లన్న తేడా లేకుండా రంజాన్ వేడుకలు జరుపుకున్నారు.

చిత్తూరు జిల్లా.. పలమనేరు ముస్లిం సోదర సోదరీమణులకు మాజీ మంత్రి అమరనాథ రెడ్డి పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆదోనిలో ఉన్న ఆయన శనివారం ఒక ప్రకటనలో ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి పవిత్ర రంజాన్ పండుగను జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని ఆ అల్లా చల్లని చూపు చూడాలని, అందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.

ఎన్టీఆర్ జిల్లా.. నందిగామలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లింలు స్థానిక ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు ఒకరిని ఒకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లిం సోదరులకు మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ సంపూర్ణంగా అవతరించిన రంజాన్‌ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు, దీక్షలు, ఆధ్యాతిక్మక చింతన, దానాలు, ధర్మాలు చేపడతారు. నెలవంకతో ప్రారంభమైన రంజాన్‌ మాసం. మళ్లీ నెలవంక రాకతో ముగుస్తుంది. రాజు, రైతు, ధనిక, పేద, జాతి, వర్గ బేధాలు లేకుండా అందరూ ఒకరికొకరు భుజానికి భుజం, పాదానికి పాదం కలిపి నమాజుకై రోజుకు ఐదు సార్లు నిలబడి విశ్వమానవ సోదర భావాన్ని చాటుతారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అల్లాహ్ అనుగ్రహం అనునిత్యం ఉండాలని, మీ జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాని అన్నారు.

కాకినాడ జిల్లాలో.. అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానంలోని ప్రసిద్ధి చెందిన జామా మసీదులో రంజాన్ వేడుకలు ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. నెలరోజుల పాటు ఉపవాసం దీక్షలు చేపట్టిన వీరంతా ఈరోజు ఉదయం కొత్త బట్టలు ధరించి మసీదులో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు.. మత గురువులు ఖురాన్ గ్రంథం నుండి అనేక విషయాలను వివరించారు.. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.. రంజాన్ మాసం సందర్భంగా ఈద్ ముబారక్ అంటూ ప్రముఖులకు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు.. ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. మసీదును విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.. పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ గత రాత్రి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు..

కోనసీమ జిల్లా.. రంజాన్ పర్వదినాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమలాపురం, పి గన్నవరం, పోతవరం, మామిడి కుదురు, అంబాజీపేట, ముమ్మిడివరం, తాళ్ళరేవు.. ఐ పోలవరం.. కాట్రేనికోన.. ముమ్మిడివరం తదితర మండలాల పరిధిలోని మసీదుల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.. మసీదులలో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దాట్ల బుచ్చిబాబు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

కర్నూలులో.. రంజాన్ పండుగను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని కొత్త బస్టాండ్, సంతోష్ నగర్, కల్లూరులోని మసీదుల్లో ముస్లింలు రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కర్నూలు, పాణ్యం ఎమ్మెల్యేలు హాఫీస్ ఖాన్, కాటసాని రాం భూపాల్ రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ. మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఎమ్మెల్యేలు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కర్నూలులో అన్ని పండుగలు అందరూ కలిసిమెలిసి చేసుకోవడం ఆనవాయితీ అని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు నియమించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.