ETV Bharat / state

Rahul Gandhi in Gannavaram: 'రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం బాధాకరం.. జగన్​ను బీజేపీ బాగా వాడుకుంటోంది' - రాజధాని ప్రాంతంలో ప్రియాంకగాంధీ పర్యటన

Rahul Gandhi meeting with Congress leaders : రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మిగిలిపోవడం బాధాకరమని.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విచారణ వ్యక్తం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో త్వరలోనే ప్రియాంకగాంధీ పర్యటిస్తారని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో రాహుల్‌ చెప్పారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 3, 2023, 9:16 AM IST

Updated : Jul 3, 2023, 12:38 PM IST

రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం బాధాకరం

Rahul Gandhi Meeting with Congress Leaders : రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో ఆ పార్టీ అగ్రనేత సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన తెలంగాణ జనగర్జన సభలో పాల్గొన్న రాహుల్‌గాంధీ.. ఆ తర్వాత రోడ్డు మార్గంలో రాత్రి 10 గంటల 20 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న ఏపీ కాంగ్రెస్ నాయకుల బృందంతో దాదాపు 20 నిమిషాలు మాట్లాడారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు.

త్వరలో విశాఖకు రానున్న రాహుల్‌గాంధీ : రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులు పడుతున్న వేదన, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారిని వేధిస్తున్న తీరు గురించి రాహుల్‌ దృష్టికి నేతలు తీసుకెళ్లగా. అవన్నీ తెలుసని రాహుల్‌గాంధీ చెప్పారు. విభజన హామీలు, ప్రత్యేకహోదా, పోలవరం సహా ఇతర కీలక అంశాల గురించి ప్రస్తావించగా, కేంద్రంలో యూపీఏ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క హామీని నేరవేర్చి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి సంఘీభావం తెలిపేందుకు ఈ నెల లేదా వచ్చే నెలలో విశాఖ సభలో పాల్గొంటానని కాంగ్రెస్‌ నేతలతో రాహుల్‌గాంధీ చెప్పారు. రాహుల్‌తో భేటీ అనంతరం పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు వివరాలను వెల్లడించారు.

'ప్రధానంగా రాజధానికి సంబంధించిన అంశం, పోలవరానికి సంబంధించిన విషయాలు, 3 మూడు రాజదానుల విషయాల గురించి రాహుల్​గాంధీతో చర్చించాం. అమరావతి రాజధాని నిర్ణయానికి రాహుల్​గాంధీ కట్టుబడి ఉన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా పోరాడుతున్న వారికి సంఘీభావం తెలపడానికిి ఈ నెల లేదా ఆగష్టులో రాహుల్​గాంధీ విశాఖకు రానున్నారు.'-గిడుగు రుద్రరాజు, పీసీసీ అధ్యక్షుడు

జగన్ కేసులపై ఆరా.. సీఎంను బీజేపీ వాడుకుంటుంది : సీఎం జగన్‌పై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచారణ పురోగతి గురించి రాహుల్‌గాంధీ ఆరా తీశారు. ఆయన ఈ కేసుల్లో విచారణకు కోర్టుకూ వెళ్లట్లేదని ఆ కేసులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయని కాంగ్రెస్‌ నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేసులను బూచిగా చూపించి బీజేపీ జగన్‌ను బాగానే వాడుకుంటోందని రాహుల్‌ వ్యాఖ్యానించారని సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.

ఆ మూడు పార్టీలు బీజేపీతో ఉన్నాయి : అనంతరం రాష్ట్రంలో వైఎస్సార్​సీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏం చేస్తున్నాయి..? ఆయా పార్టీల పట్ల ప్రజల అభిప్రాయం ఎలా ఉంది..? బీజేపీతో ఈ మూడు పార్టీలు ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తున్నాయనే అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. బీజేపీతో ఈ మూడు పార్టీలు కలిసే ఉన్నాయని, రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తున్నాయని రాహుల్‌గాంధీకి వివరించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు

4 వేల రూపాయల పింఛన్‌ : అంతకుముందుతెలంగాణలోని ఖమ్మంలో కాంగ్రెస్‌ నిర్వహించిన జనగర్జనసభలో మాట్లాడిన రాహుల్‌గాంధీ.. బీఆర్​ఎస్​, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాల్లో అవినీతికి పాల్పడుతోందని, ఇదంతా నరేంద్రమోదీకి తెలుసని విమర్శించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు 4 వేల రూపాయల పింఛన్‌ను అందిస్తామని ప్రకటించారు.

సభ ముగిశాక ఖమ్మం నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రాహుల్‌ గాంధీ ప్రత్యేక విమానంలో దిల్లీ బయల్దేరివెళ్లారు.

'కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాల్లో అవినీతికి పాల్పడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులకు, వితంతువులకు 4 వేల రూపాయల పింఛన్‌ను అందిస్తాం.'- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

Last Updated : Jul 3, 2023, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.