ETV Bharat / state

Power employees protest : ఈనెల 10 నుంచి నిరవధిక సమ్మె.. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ ఉద్యోగుల అల్టిమేటం - Electricity Subsidy

Power Employees Protest : ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి నేడు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని.. విద్యుత్‌ సంస్థ యాజమాన్యం, పోలీసుల అభ్యర్థన మేరకు నిలుపుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల ఐకాస నాయకులు ప్రకటించారు. వర్క్‌ టూ రూల్‌ నిరసన కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని స్పష్టం చేశారు..

AP Power Employees Protest
10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె ఐకాస నేతలు
author img

By

Published : Aug 8, 2023, 10:46 AM IST

ఈనెల 10 నుంచి విద్యుత్‌ ఉద్యోగుల నిరవధిక సమ్మె

Power employees protest : విద్యుత్ ఉద్యోగులు ఛలో విద్యుత్ సౌధ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ 8వ తేదీ చలో విజయవాడ పిలుపునిచ్చిచారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఈ ఆందోళన కార్యక్రమానికి విద్యుత్ ఉద్యోగులు(electricity employees) రానున్న సందర్భంగా.. పోలీసులు, యాజమాన్యం అభ్యర్థన మేరకు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిలుపుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు జేఏసీ నాయకులు ప్రకటించారు.

Electricity employees strike: సమ్మెకు దిగడమే సమస్యలకు పరిష్కారం.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గత నెల 20వతేదీన యాజమాన్యానికి నోటీస్ ఇచ్చామని, ఎన్ని సార్లు చర్చలు జరిపినా ప్రభుత్వం, యాజమాన్యం హామీ ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, యాజమాన్య అభ్యర్ధన మేరకు చలో విజయవాడ కార్యక్రమం నిలిపివేసి, వర్క్ టు రూల్ నిరసన కార్యక్రమం యధావిధిగా కొనసాగిస్తామని చెప్పారు.

Electricity Subsidy : ఏపీలో విద్యుత్ రాయితీపై కోతలు.. 2.35 లక్షల కుటుంబాలకు షాక్​..

ఆగస్టు 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె... ఈ నెల 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని, కాంట్రాక్టు కార్మికులకు నేరుగా వేతనాలు ఇస్తామని సీఎం జగన్(CM Jagan) పాదయాత్రలో హామీ ఇచ్చారని పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం జేఏసీ కన్వీనర్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. 12 డిమాండ్లపై యాజమాన్యానికి నోటీస్ ఇచ్చామన్నారు. స్పందన రాకుంటే ఆగస్టు 10 నుంచి నిరవధిక సమ్మె వెళ్లనున్నామని తెలిపారు.

Electricity employees strike: చర్చలు విఫలం : విద్యుత్‌ సంస్థలతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. మరో దఫా చర్చలు జరుపుతామంటూ యాజమాన్యం చేసిన ప్రకటనలో సానుకూల స్పందన రాకుంటే ఈనెల 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె తప్పదని విద్యుత్​ ఉద్యోగుల జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఐదు గంటలపాటు విజయవాడ గుణదలలో యాజమాన్యంతో జరిగిన చర్చలు అసంపూర్ణంగా నిలిచిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యాజమాన్యం మొండి వైఖరి కనబరుస్తోందని ఆవేదన చెందారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా రేపు, ఎల్లుండి రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

POWER EMPLOYEES PROTEST: డిమాండ్లు నెరవేర్చాలని.. విద్యుత్ ఉద్యోగుల ఆందోళన

ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేస్తున్న తాము ఏ ఆసుపత్రికి వెళ్లినా తమకు పరిమితి లేని వైద్య విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. కాంట్రాక్టు కార్మికుల సేవలను క్రమబద్ధీకరించాలని.. ఎనర్జీ అసిస్టెంట్‌లను తమతోపాటు సమానంగా ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. నాలుగేళ్ల నుంచి దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలు పై నిరీక్షిస్తూనే ఉన్నామని.. గతనెల 27వ తేదీన 12 ప్రధాన డిమాండ్లతో నోటీసులు ఇచ్చామని తెలిపారు.

Prathidwani: డిమాండ్ల సాధనకు విద్యుత్ ఉద్యోగుల పోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.