ETV Bharat / state

ఎన్టీఆర్​ 27వ వర్ధంతి.. చంద్రబాబు, లోకేశ్​ నివాళి - leaders paid tribute to NTR on his 27th death

NTR DEATH ANNIVERSARY : టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత నేత ఎన్టీఆర్​ 27వ వర్ధంతి సందర్భంగా ఆయనకు పలువురు నివాళులు అర్పించారు. మహానటుడిగా, ప్రజానాయకుడిగా ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన శకపురుషుడు ఎన్టీఆర్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు.

NTR DEATH ANNIVERSARY
NTR DEATH ANNIVERSARY
author img

By

Published : Jan 18, 2023, 12:13 PM IST

TRIBUTES TO NTR : మహానటుడిగా, ప్రజానాయకుడిగా ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన శకపురుషుడు ఎన్టీఆర్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజాహిత పాలనకు, సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా.. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా.. జాతీయ రాజకీయాలకు సరికొత్త దిశా నిర్దేశం చేసిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.

రాజకీయాల్లో మహిళలు బడుగు వర్గాల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు, అట్టడుగు వర్గాలకు సంక్షేమాన్ని అందించేందుకు.. మహిళలకు ఆస్తి హక్కు, బీసీలకు రిజర్వేషన్లు, రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలతో సమసమాజ స్థాపనకు బాటలు వేసిన ఎన్టీఆర్ ఆశయ సాధనకు అందరం కృషిచేద్దామని పిలుపునిచ్చారు.

  • మహానటుడిగా, ప్రజానాయకుడిగా ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన శకపురుషుడు ఎన్టీఆర్. ప్రజాహిత పాలనకు, సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా... తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా... జాతీయ రాజకీయాలకు సరికొత్త దిశా నిర్దేశం చేసిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు.(1/2) pic.twitter.com/gKzVjlMRdY

    — N Chandrababu Naidu (@ncbn) January 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎనలేని సేవలు చేసిన మహోన్నత వ్యక్తి: తెలుగుజాతి కీర్తి కిరీటం ఎన్టీఆర్‌ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అన్నారు. ఆయన వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు భాష‌, సినిమా, రాజ‌కీయాల్లో ఎన్టీఆర్‌ ఎన‌లేని సేవలు చేశారన్నారు. ఎన్టీఆర్‌ ఆశ‌య‌ సాధ‌న కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

  • తెలుగుజాతి కీర్తి కిరీటం,తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు నంద‌మూరి తార‌క‌రామారావు గారి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయునికి ఘ‌న‌నివాళులు అర్పిస్తున్నాను. తెలుగు భాష‌,సినిమా,క‌ళ‌లు, రాజ‌కీయాలు,సాహిత్య రంగాల వికాసానికి ఎన‌లేని కృషిచేసి మ‌హానాయ‌కులైన మీ స్ఫూర్తి మాకు దిక్సూచి.(1/2) pic.twitter.com/9CGtZrprwt

    — Lokesh Nara (@naralokesh) January 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.