ETV Bharat / state

పంప్​డ్​ స్టోరేజ్​ ప్రాజెక్టుల ఒప్పందాలను వెంటనే నిలిపివేయాలి: పయ్యావుల - నామినేషన్ విధానంలో పనులు

Payyavula Keshav : పంప్​డ్​ స్టోరేజ్​ ప్రాజెక్టుల ఒప్పందాలపై ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్​ పయ్యావుల కేశవ్​ స్పందించారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం పీఎస్పీ విధానాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు.

Payyavula Keshav
పయ్యావుల కేశవ్​
author img

By

Published : Dec 13, 2022, 3:03 PM IST

Payyavula Keshav: పంప్​డ్​ స్టోరేజ్ ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలను విద్యుత్ శాఖ తక్షణమే నిలిపివేసి.. పునఃపరిశీలన చేయాలని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. కేంద్రం మార్గదర్శకాలకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం పీఎస్పీ విధానం అమలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. సహజవనరులను ఏకపక్షంగా సొంత వర్గానికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. టెండర్లు పిలవడం ద్వారానే సహజ వనరులను కట్టబెట్టాలనే నిబంధనను వదిలిపెట్టి.. నామినేషన్ విధానంలో పనులు కట్టబెట్టారని మండిపడ్డారు. ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వ ఆస్తులు, భూములు దోచిపెట్టడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో పవన, సౌర విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని.. ఆరోపణలు చేసిన జగన్​మోహన్ రెడ్డి అవినీతిని నిరూపించలేకపోయారనీ అన్నారు. ముఖ్యమంత్రిగా తొలి ప్రసంగంలో చంద్రబాబుపై చేసిన అసత్య ఆరోపణలపై క్షమాపణ చెప్పడం ఇష్టం లేకపోతే.. కనీసం ప్రజలకైనా సమాధానం చెప్పాలని హితవు పలికారు. దేశంలో అన్ని రాష్ట్రాలు తిరస్కరించిన సెకీ టెండర్లను ఈ ప్రభుత్వం ఖరారు చేసుకుందని విమర్శించారు. జగన్ చేసిన తప్పుడు నిర్ణయం వల్ల సామాన్యులు బిల్లులు చెల్లించాల్సి వస్తోందని కేశవ్ దుయ్యబట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.