Passport Officer Interview: కొవిడ్ తర్వాత అందరూ ఒక్కసారిగా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవటంతోనే స్లాట్లు ఆలస్యంగా లభిస్తున్నాయని పాస్ పోర్ట్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పాస్ పోర్ట్ స్లాట్ బుకింగ్‌కు 40 రోజులు పడుతుందని చెబుతున్నారు . శనివారం రోజుల్లో ప్రత్యేక మేళాలు ఏర్పాటు చేసి 11వందల మందికి స్లాట్ల్స్ ఇస్తున్నామని తెలిపారు. మూడు ధ్రువపత్రాలు కలిగిన వారు మాత్రమే తత్కాల్‌కు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైన వారికి పాస్ పోర్ట్ లు త్వరగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పాస్ పోర్ట్ కోసం దళారులను ఆశ్రయించవద్దని నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. అభ్యర్ధులకు సమస్య వస్తే rpo.vijayawada@mea.gov.in మెయిల్ కు ,18002581800 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు లు పంపొచ్చని చెబుతున్న విజయవాడ ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి డి.ఎస్.ఎస్ శ్రీనివాసరావుతో మాప్రతినిధి ముఖాముఖి...
ఇవీ చదవండి