Opposition Parties On GO Number One : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయలాని కోరుతూ.. ప్రతిపక్షాలు ఈ నెల 20వ తేదీన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టాయి. దీనికోసం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. జీవో నెంబర్ ఒకటిని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపేదే లేదని.. అంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
టీడీపీ నాయకులు నాయకులు వర్ల రామయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కలనే ప్రధాన ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటిని తీసుకువచ్చిందని మండిపడ్డారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ జీవో ఒకటిని తీసుకు వచ్చారని ఆరోపించారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమానికి టీడీపీ మద్దతు ఉంటుందని తెలిపారు. పోలీసులు చేసే ముందస్తు అరెస్టులకు దొరకకుండా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తామని అన్నారు. ముఖ్యమంత్రి ఇంటి తలుపులు తట్టి.. ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు తీసుకువచ్చిన జీవోను వెనక్కి తీసుకునే వరకు అక్కడి నుంచి కదిలేది లేదనే రీతిలో కార్యక్రమం చేస్తామని అన్నారు. జీవో నెంబర్ వన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపేదే లేదని స్పష్టం చేశారు.
"పోలీసులు ముందస్తు అరెస్టులు చేయాలని చూస్తే వారికి దొరక్కుండా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లాలి. ముఖ్యమంత్రి ఇంటి తలుపులు తట్టి, జీవోను వెనక్కి తీసుకునే వరకు అక్కడి నుంచి కదిలేదే లేదని రీతిలో కార్యక్రమం ఉండాలి." - వర్ల రామయ్య, టీడీపీ నాయకులు
దేశంలో ఎక్కడ లేని విధంగా జీవో నెంబర్ ఒకటిని రాష్ట్రంలో ప్రవేశపెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. పోలీసుల అనుమతితో చివరకి ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలనుకున్న.. ముందస్తు అరెస్టుల పేరుతో గృహ నిర్బంధలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన పోరాడుతుంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. అరెస్టులు చేస్తూ బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని, చట్టాలను ఉల్లంఘిస్తున్నారని .. ప్రజా హక్కులకు పాతర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటిని ఉపసంహరించుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. చీకటి జీవో ఒకటికి వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీన నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
"దేశంలో ఎక్కడ లేని జీవో నెంబర్ ఒకటిని రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. . ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారు. ప్రజల పక్షాన పోరాడుతుంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. పోలీసులు అనుమతితో ధర్నా నిర్వహిస్తున్న ముందస్తు అరెస్టులు చేస్తున్నారు." - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి :