No Digital Only Cash in Vijayawada Bus Stand: పెద్దనోట్ల రద్దు, కరోనా కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాలలో డిజిటల్ పేమెంట్లు పెరిగాయి. తొలుత చిన్నగా మొదలైన డిజిటల్ చెల్లింపులు.. క్రమ క్రమంగా పుంజుకున్నాయి. ప్రస్తుతం ఏ చిన్న దుకాణానికి వెళ్లి వస్తువు కొనుగోలు చేసిన.. ఫోన్ పే, గూగుల్ పే, పేటియం ద్వారా ఆన్‌లైన్ పేమెంట్లు చేసేస్తున్నారు. అంతేకాకుండా.. విమాన, రైలు, బస్సు ప్రయాణాలకు సంబంధించి.. ఆన్‌లైన్‌లో పేమెంట్లు చెల్లించి టికెట్ బుక్ చేసుకుంటున్నారు. అయితే, విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో మాత్రం ఇందుకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ టికెట్ బుకింగ్ కౌంటర్లలో డిజిటల్ పేమెంట్ల సదుపాయాన్ని ఎత్తివేశారు. మరోవైపు వెబ్‌సైట్‌లో సైతం డిజిటల్ పేమెంట్లు తరచూ విఫలమవుతుండడంతో ప్రయాణికులు.. రాష్ట్ర ప్రభుత్వంపై, ఆర్టీసీ యాజమాన్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Reservation Counters Closed at Vja Bus Station: విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్ స్టేషన్‌లో నాలుగు రిజర్వేషన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. సిబ్బందిని నియమించి 24 గంటల పాటు టికెట్లు జారీ చేసే ఏర్పాటు చేశారు. గతంలో క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆన్‌లైన్ పేమెంట్లు చేసే సదుపాయం కల్పించారు. చిల్లర సమస్య లేకపోవడంతో సిబ్బందికీ టికెట్లు జారీ చేయడం సులభంగా ఉండేది. ఏడాదిన్నర నుంచి ఈ సేవలను యాజమాన్యం నిలిపివేసింది. దీంతో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్ పేమెంట్ లేక అనేక మంది ప్రయాణికులు ఏటీఎం కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు.
Passengers Fire on RTC Officials: డిజిటల్ పేమెంట్ల నిలుపుదలతో రిజర్వేషన్ కోసం విజయవాడ బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు గణనీయంగా తగ్గిపోయారు. రద్దీ, ఆదాయం తగ్గిందన్న కారణం చూపి రెండు కౌంటర్లను అధికారులు మూసి వేశారు. గతంలో ఉన్నట్లుగా డిజిటల్ పేమెంట్ సదుపాయం పెట్టి కౌంటర్లు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నా.. ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీని ప్రభావంతో ఆక్యుపెన్సీ రేషియో తగ్గి, సంస్థకూ నష్టం వస్తోందని ప్రయాణికులు వ్యాఖ్యానిస్తున్నారు. డిజిటల్ పేమెంట్లు పని చేయక చాలామంది ప్రయాణికులు తెలంగాణ బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల క్రమంగా సంస్థకు ప్రయాణికుల దూరమవుతున్నారు.
విజయవాడ బస్టాండ్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
''ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్లలో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఒకటి. అటువంటి బస్టాండ్‌లో డిజిటల్ పేమెంట్లు బంద్ చేశారు. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ బస్ స్టేషన్‌లో కూడా ఇదే పరిస్ధితి ఉంది. ఆర్టీసీ కౌంటర్లు, వెబ్‌సైట్లలో డిజిటల్ పేమెంట్లు పనిచేయడం లేదు. ఈ విషయాన్ని అధికారులకు చెప్తే పట్టించుకోవటం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి..అన్ని బస్ సేషన్లలో రిజర్వేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.''-ప్రయాణికులు, విజయవాడ బస్ స్టేషన్
Gujarth RTC Team in AP: రాష్ట్రానికి గుజరాత్ ఆర్టీసీ బృందం.. పండిట్ నెహ్రు బస్‌స్టేషన్ పరిశీలన