ETV Bharat / state

రాష్ట్ర కాంగ్రెస్​ నూతన కమిటీల నియామకం.. - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ

Pradesh Congress Committee in AP: రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నూతన కమిటీని నియమించినట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్​వలి తెలిపారు. నూతన కమిటీ ఈనెల 9వ తేదీన మధ్యాహ్నం 1గంటకు భవానీపురంలో ఉన్న ఎన్​ కన్వెన్షన్​లో ప్రమాణ స్వీకారం చేస్తుందన్నారు.

pcc
పీసీసీ
author img

By

Published : Dec 3, 2022, 6:31 PM IST

Pradesh Congress Committee: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు కలసి రాష్ట్ర నూతన కమిటీని నియమించినట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి తెలిపారు. ఈ కమిటీ అధ్యక్షుడిగా రుద్రరాజు ఉంటారని, వర్కింగ్ ప్రెసిడెంట్, మీడియా చైర్మన్, కమిటీ చైర్మన్, ఇతర నాయకులకు బాధ్యతలు కేటాయించామని మస్తాన్​వలి తెలిపారు. నూతన కమిటీ ఈనెల 9వ తేదీన మధ్యాహ్నం 1గంటకు భవానీపురంలో ఉన్న ఎన్ కన్వెన్షన్​లో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ దోపిడీ విధానంలో మిత్రులకి పరోక్షంగా సహాయం చేస్తున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంతో పాటుగా.. రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యన విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

గడిచిన మూడున్నర సంవత్సరాలు కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ నొక్కుతారు జనాలకి డబ్బులు పోవంటూ ఆరోపించారు. వారికి ఇచ్చిన అరకొరా డబ్బుల్ని మద్యం, ఆటో ఫైన్ల రూపంలోనూ.. తిరిగి వసూలు చేసుకుంటున్నారని ఆరోపించారు. డబ్బులు స్కూలుకి ఇస్తే పిల్లలు చదువుకుంటారు, కానీ వారి అకౌంట్లో వేస్తే ఏం ఉపయోగం అని ప్రశ్నించారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లాది ప్రజలకు తాగునీరు అందించే సంజీవిని పోలవరం ప్రాజెక్టు ఇప్పటివరకు పూర్తి చేయలేదని ఆయన ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.