Nara Lokesh Challenge to YSRCP: స్కిల్ డెవలప్‌మెంట్‌లో తనపై చేసిన అవినీతీ అరోపణలు.. దమ్ముటే ఆధారాలతో నిరూపించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు. ఇందుకు 24 గంటలు సమయమిస్తున్నట్లు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో నిడమర్రు గ్రామంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. జగన్ ప్రజలను పెడుతున్న బాధలన్నీ వింటున్నానని.. వైసీపీ నేతలు ప్రజాసమస్యలు వినాలని సూచించారు. ఇళ్ల కూల్చివేతకు అధికారులు నోటీసులు ఇచ్చారని.. స్థానిక మహిళలు లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. ఎప్పుడొచ్చి ఇళ్లు కూలుస్తారోననే భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామసభ నిర్వహించటం లేదని.. వాలంటీర్లకు సమస్య చెప్తే.. వారు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. పోరాటం చేసైనా సరే.. మీకు న్యాయం చేసేలా చూస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. మంగళగిరిలో 10వేల ఇళ్లు కట్టించి తీరుతామని లోకేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు.
జగన్.. ప్రజలను పెడుతున్న బాధలను వింటున్నా.. కంటున్నా.. వైకాపా నేతలు రోడ్డుపైకి వచ్చి ప్రజాసమస్యలు వినాలి. స్కిల్ డెవలప్‌మెంట్‌లో అవినీతి అంటూ నాపై ఆరోపణలు చేశారు. మరో 24 గంటల సమయం ఇస్తున్నా.. ఆధారాలు చూపించాలి. నాపై 7 అంశాల్లో ఆరోపణలు చేశారు.. ఒక్కటీ నిరూపించ లేదు. నాపై ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తా. -నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి: