Nara Bhuvaneshwari Nijam Gelavali Program Updates: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో మనోవేదనకు గురై, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ఆయన (చంద్రబాబు) సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 25వ తేదీ నుంచి 'నిజం గెలవాలి' పేరుతో ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. మొదటి దశలో.. తిరుపతి జిల్లాలోని అగరాల, శ్రీకాళహస్తి, ఎర్రంరెడ్డిపాలెం, మునగాలపాలెంలో పర్యటించిన ఆమె.. నవంబర్ 1 నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Nijam Gelavali Malividuta Program Update: చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు.. నవంబర్ 1వ తేదీ నుంచి నారా భువనేశ్వరి మలివిడుత 'నిజం గెలవాలి' కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని పార్టీ నేతలు తెలిపారు. మొదటి దశలో తిరుపతి జిల్లాలో పర్యటించిన ఆమె.. నవంబర్ 1వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారని పేర్కొన్నారు. నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, 2వ తేదీన విజయనగరం జిల్లాలోని ఎచ్చర్ల, బొబ్బిలి, 3వ తేదీన విజయనగరం నియోజకవర్గాల్లో నిర్వహించే 'నిజం గెలవాలి' కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొనున్నారని వెల్లడించారు.
Bhuvaneswari Visit Train Accident Victims: అయితే, మలివిడుత పర్యటనకు ముందు నారా భువనేశ్వరి.. విజయనగరం జిల్లా రైలు ప్రమాదంలో గాయపడి, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంగళవారం పరామర్శించనున్నారు. అనంతరం ఆముదాలవలస వెళ్లి అక్కడ బస చేయనున్నారు. బుధవారం నుంచి 'నిజం గెలవాలి' కార్యక్రమంలో పాల్గొంటారని.. పార్టీ నేతలు నిజం గెలవాలి పర్యటన వివరాలను వెల్లడించారు.
Bhuvaneswari on VZM Train Accident: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య గత రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంపై.. నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమె కోరారు.
Vizianagaram Train Accident: ఈ నేపథ్యంలో విజయనగరంలో జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను నారా భువనేశ్వరి రేపు పరామర్శించి..ఆ తర్వాత ఆముదాలవలస వెళ్లానున్నారు. అనంతరం అక్కడ బస చేసి.. బుధవారం నుంచి మృతుల కుటుంబాలను పరామర్శించునున్నారు.
Nara Bhuvaneshwari Comments: 'వైసీపీది ధన బలం- టీడీపీది ప్రజా బలం.. 2024లో టీడీపీ-జనసేన అఖండ విజయం'