ETV Bharat / state

మా పార్టీలో అధ్యక్షుల మార్పు నిరంతర ప్రక్రియ.. : మంత్రి కారుమూరి - మంత్రి కారుమూరి

MINISTER KARUMURI COMMENTS ON CHANDRABABU : చంద్రబాబు వల్లే వైసీపీలో అధ్యక్షుల మార్చారని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని మంత్రి కారుమూరి అన్నారు. అధ్యక్షుల మార్పు అనేది తమ పార్టీ నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొంటుందని మంత్రి పేర్కొన్నారు.

MINISTER KARUMURI COMMENTS ON CHANDRABABU

author img

By

Published : Nov 24, 2022, 8:03 PM IST

MINISTER KARUMURI ON CBN : వైసీపీలో అధ్యక్షుల మార్పు అనేది తమ పార్టీ నిరంతర ప్రక్రియ అని.. చంద్రబాబు వల్ల అధ్యక్షులను మార్చలేదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. చంద్రబాబు వల్లే మార్చారని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. చంద్రబాబు ఉక్రోశంతో రౌడీనంటూ దారుణంగా‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారన్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఎలాగో ఓడిపోతుందని తెలిసే.. తననైనా గెలిపించాలని చంద్రబాబు ప్రజలను బ్రతిమిలాడుతున్నారని ఎద్దేవా చేశారు. కోర్టును తప్పుదోవ పట్టించినందుకే ఇప్పటం గ్రామస్థులకు ఫైన్ వేసిందని తెలిపారు.

రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొంటుంది: రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. దళారులు రైతులను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. రైతుల ఖాతాల్లో నిన్న ఆన్‌లైన్‌లో రూ.160 కోట్లు జమచేశామన్నారు. పౌరసరఫరాల శాఖకు నిధుల ఇబ్బంది లేదని.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే 21 రోజుల్లో చెల్లింపులు జరుగుతాయన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.