Minister Kakani Govardhan Reddy: రైతులకు లబ్దిచేకూర్చే విధంగా ఆయిల్‌పామ్ ధరలను నిర్ణయిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన ఆయిల్‌పామ్ ధరల ఫార్ములా ఖరారు కమిటీ సమావేశానికి హాజరైన మంత్రి అధికారులు, రైతులతో మాట్లాడారు. ఆయిల్‌పామ్ రైతులకు లబ్దిచేకూర్చే విధంగా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేస్తోందన్నారు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో ఆయిల్‌పామ్ ధరల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గిస్తామన్నారు. రాష్ట్రంలోని ఆయిల్‌పామ్ రైతులకు రూ.84 కోట్ల మేర వ్యత్యాస ధరను చెల్లించినట్టు మంత్రి స్పష్టం చేశారు.
పామాయిల్ సీడ్స్ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియే శాతం ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ శాతాన్నే ఏపీలో కూడా అమలు చేస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం ఎఫ్ఎఫ్బి ధరను రూ.18,300/- రూపాయలను రైతులకు చెల్లిస్తున్నట్టు స్పష్టం చేశారు. 2021 నవంబరు 1 నుంచి 2022 అక్టోబరు 31 వరకూ ఆయిల్ రికవరీని 19.22 శాతాన్ని, నట్స్ రికవరీ శాతాన్ని 10.25 గాను పరిగణిస్తూ రైతులకు ఆయిల్‌పామ్ ధరలను చెల్లిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాదిలోనూ మెరుగైన రీతిలోనే ఎఫ్ఎఫ్బీని పరిగణిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: