ETV Bharat / state

డిసెంబర్ 8న వైసీపీ బీసీ నేతల ఆత్మీయ సమావేశం.. - ఏపీ రాజకీయ వార్తలు

Meeting of BC Ministers and MLAs: డిసెంబర్ 8న వైసీపీ బీసీ నేతల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమై ఆత్మీయ భేటీపై చర్చించిన నేతలు.. సమావేశానికి సీఎం జగన్ ను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బీసీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేస్తారని వైసీపీ నేతలు వెల్లడించారు.

Meeting of BC Ministers and MLAs
వైకాపా బీసీ నేతలు
author img

By

Published : Nov 26, 2022, 10:26 PM IST

డిసెంబర్ 8న వైకాపా బీసీ నేతల ఆత్మీయ సమావేశం

Meeting of BC Ministers and MLAs in AP: డిసెంబర్ 8 తేదీన బీసీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ ప్రకటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధుల సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. బీసీల ఆత్మీయ సమ్మేళనానికి సీఎం జగన్​ను ఆహ్వానిస్తామని మంత్రి తెలిపారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధుల సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, పార్ధ సారధి ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి తదితరులు హాజరయ్యారు.

వచ్చే ఎన్నికల్లో బీసీ వర్గాలను ఏకీకృతం చేయడం, సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై బీసీ ప్రజాప్రతినిధులు సమావేశంలో చర్చించారు. 139 బీసీ కులాలకు 1.71 లక్షల కోట్లను తమ ప్రభుత్వం డీబీటీ ద్వారా అందించిందని వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్తామని ఎమ్మెల్సీ జంగాకృష్ణమూర్తి వెల్లడించారు. 156 కార్పోరేషన్ల ద్వారా బీసీల రాజకీయంగా, సామాజిక అభ్యున్నతికి వైకాపా ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.