Medical Health Department statement on CHOs Agitation: సీహెచ్‌వోలు వెంటనే ఆందోళన విరమించి, విధుల్లో చేరాలని.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. సహేతుకం కాని డిమాండ్లతో సీహెచ్‌వోలు ఆందోళన చేయడం సరికాదన్నారు. సీహెచ్‌వోలను ఏడాది ఒప్పందంపై నియమించామని, పనితీరు ఆధారంగా ఒప్పందాన్ని పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ఆందోళన విరమించి వెంటనే విధుల్లో చేరకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణబాబు హెచ్చరించారు.
CHOs Demands: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద విలేజ్ హెల్త్ క్లినిక్‌ల్లో పని చేస్తున్న సామాజిక ఆరోగ్య అధికారులు (సీహెచ్‌వో) గతకొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న తమకు (సీహెచ్‌వో).. కేంద్రం తన వాటా మొత్తాన్ని చెల్లిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం గత పది నెలలుగా ఆ మొత్తాన్ని ఉద్యోగులకు ఇవ్వడం లేదని సీహెచ్‌వోలు ఆవేదన చెందారు. దీంతో పాటు హామీ మేరకు పీఆర్‌సీ అమలు కావడం లేదని, అయిదేళ్ల సర్వీసు పూర్తయినవారిని రెగ్యులర్ చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ.. దశలవారీగా ఆందోళన చేపట్టారు. తాజాగా డిసెంబర్ 13న విజయవాడ ధర్నాచౌక్‌లో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని సీహెచ్‌వోలు నిర్ణయించారు.
బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి నుంచి రజిని తొలగింపు
Medical Health Dept Fire on CHOs Agitation: ఈ క్రమంలో సీహెచ్‌వోలు వెంటనే ఆందోళన విరమించాలని మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. సహేతుకం కాని డిమాండ్లతో ఆందోళన చేస్తున్న సామాజిక ఆరోగ్య అధికారులు (CHOs/MLHPs) ఆందోళన చేయడం సరికాదని స్పష్టం చేసింది. ఆందోళన విరమించుకుని వెంటనే విధుల్లో చేరాలని.. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఆదేశించారు.
Krishnababu Comments: ''కేంద్ర నిబంధనల ప్రకారం.. ప్రతి 5వేల జనాభాకు ఒక ఆరోగ్య ఉపకేంద్రం ఉంది. ఈ క్లినిక్‌లలో నియమితులైన సీహెచ్‌వోలు ఒక ఏడాది కాంట్రాక్ట్ ప నియమితులయ్యారు. వారి పనితీరు అంచనా ఆధారంగా ఆ కాంట్రాక్ట్‌ను పునరుద్ధరిస్తాం. ప్రభుత్వంతో కుదుర్చుకున్న వార్షిక ఒప్పంద షరతుల ప్రకారం.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, వేతనాలను నిలుపు చేయటంతో పాటు విధుల నుండి తొలగిస్తాం. 28వ తేదీ నుండి మందుల జారీ వివరాల నమోదు నిలిపివేత, 30వ తేదీ నుండి అధికారిక వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల నుండి నిష్క్రమణ, డిసెంబర్ 1వ తేదీ నుండి యాప్‌లో నివేదికల నమోదు నిలిపివేతలు సహేతుకం కాదు. సీహెచ్‌వోలు వెంటనే ఆందోళన విరమించి విధుల్లో చేరకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం.'' అని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అన్నారు.
ఏపీలో దీపావళి పండగ సెలవు 13వ తేదీకి మార్పు - ప్రభుత్వ ఉత్తర్వులు
Krishnababu on CHOs Appointment: గ్రామీణ వైద్య సేవల కోసం ప్రభుత్వం 2019 నుంచి సీహెచ్‌వోలను నియమించిందని.. కృష్ణబాబు పేర్కొన్నారు. గ్రామ సచివాలయ పరిధిలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ క్లినిక్‌లలో నియమితులైన సీహెచ్వోలను కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక ఏడాది కాంట్రాక్ట్‌పై నియమించామన్న ఆయన.. విధుల నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు.
''సీహెచ్‌వోలు కొన్ని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇచ్చారు. అందులో.. వార్షిక ఇంక్రిమెంట్ అందజేయాలని, ఏడాదికి 35 రోజులు సెలవులు మంజూరు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్నందున సర్వీసులను రెగ్యూలరైజ్ చేయడం కుదరదు. 13వ తేదీన విజయవాడ ధర్నాచౌక్‌లో ధర్నాను విరమించుకోవాలని సీహెచ్ఓలను నేను కోరారు. సీహెచ్ఓలు విధులను నిర్లక్ష్యం చేస్తే వారిని తప్పించేందుకు కూడా వెనుకాడం.''- కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
AP Govt issued notices to Pawan: వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు.. విచారించేందుకు ప్రభుత్వం అనుమతి