Marreddy Srinivasa Reddy: మూడున్నరేళ్లలో 3వేల 200మందికి పైగా రైతుల్ని సీఎం జగన్ బలి తీసుకున్నాడని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. రైతు ఆత్మహత్యల్లో ఏపీని మూడోస్థానంలో నిలపడమేనా జగన్రెడ్డి ఘనత అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సగటున ఏడాదికి 1000 మంది రైతులు చనిపోతున్నా.. జగన్ రెడ్డిలో చలనం లేదని మండిపడ్డారు. మూడు వేలకు పైగా రైతులు చనిపోతే.. కేవలం 700 రైతు కుటుంబాలకు మాత్రమే అరకొరసాయం చేసి చేతులు దులుపుకున్నాడని దుయ్యబట్టారు. మాండౌస్ ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నాడో తెలపలని ప్రశ్నించారు. తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన ప్రాంతాల్లో తెలుగురైతు విభాగం బృందాలు పర్యటించనున్నాయని వెల్లడించారు.
ఇవీ చదవండి: