ETV Bharat / state

ఉమ్మడి స్థలంపై ఫ్లాట్ల యజమానులకే హక్కు: మద్రాసు హైకోర్టు కీలక తీర్పు

Madras High Court Key Judgement : ఫ్లాటు యజమానుల హక్కులను హరించే అపార్ట్‌మెంట్‌ నిర్మాణ బిల్డర్లకు షాకిచ్చేలా మద్రాసు హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అపార్ట్‌మెంట్‌లోని ఉమ్మడి స్థలం, అందులో అభివృద్ధి చేసిన సౌకర్యాలు… ఫ్లాటు యజమానులకే చెందుతాయని తేల్చిచెప్పింది. కామన్‌ ఏరియా, అందులోని నిర్మాణాలపై బిల్డర్‌కు ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవని స్పష్టం చేసింది. ప్రస్తుత కేసులో అవిభాజ్య వాటా స్థలం, దానిలోని నిర్మాణంపై ఫ్లాటు యజమానులందరికీ హక్కు లభించేలా ‘సవరించిన దస్త్రాలు’ రాసి ఇవ్వాలని బిల్డర్‌ను ఆదేశించింది. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.సుబ్రమణియన్, జస్టిస్‌ కే. కుమారేశ్‌బాబుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

Madras High Court
మద్రాసు హైకోర్టు
author img

By

Published : Feb 7, 2023, 8:28 PM IST

Madras High Court Key Judgement On Non FSI Issue : ఉమ్మడి స్థలంలోని అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి సంబంధించిన యాజమాన్య హక్కులపై బిల్డర్‌కు షాకిచ్చేలా మద్రాసు హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అపార్ట్‌మెంట్‌లోని ఉమ్మడి స్థలం, అందులో అభివృద్ధి చేసిన సౌకర్యాలు… ఫ్లాటు యజమానులకే చెందుతాయని తేల్చిచెప్పింది. కామన్‌ ఏరియా, అందులోని నిర్మాణాలపై బిల్డర్‌కు ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవని స్పష్టం చేసింది. ప్రస్తుత కేసులో అవిభాజ్య వాటా స్థలం, దానిలోని నిర్మాణంపై ఫ్లాటు యజమానులందరికి హక్కు లభించేలా ‘సవరించిన దస్త్రాలు’ రాసి ఇవ్వాలని బిల్డర్‌ను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. స్థలం ఒకసారి కామన్‌ ఏరియా, కామన్‌ సౌకర్యాల అభివృద్ధి కోసం అని పేర్కొన్నాక ఆ భూమి ఫ్లాటు యజమానులదే అవుతుందని.. అవిభాజ్య వాటాను మదింపు చేయడంలో పొరపాటు జరిగి ఉంటే దానిని సవరించాల్సింది బిల్డరేనని తీర్పులో తెలిపింది. నాన్‌ ఎఫ్‌ఎస్‌ఐ ఖాళీ భవనాన్ని తక్షణమే పిటిషనర్‌ ఫ్లాటు ఓనర్స అసోసియేషన్‌కు అప్పగించాలంటూ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.సుబ్రమణియన్, జస్టిస్‌ కే. కుమారేశ్‌బాబుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈమేరకు తీర్పు ఇచ్చింది.

నాన్‌ ఎఫ్‌ఎస్‌ఐ భవనాన్ని విక్రయించిన బిల్డర్​పై వ్యాజ్యం: చెన్నై ఆళ్వార్‌పేటలోని సీపీ రామస్వామి రహదారికి ఆనుకున్న పక్క స్థలంలో 77 నివాస ఫ్లాట్లు నిర్మించేందుకు 2001లో రమణీయం రియల్‌ ఎస్టేట్‌ లిమిటెడ్‌ సంస్థ అనుమతి పొందింది. యజమానులకు ఫ్లాట్లు విక్రయించింది. ఉమ్మడి స్థలంలో నాన్‌ ఎఫ్‌ఎస్‌ఐ భవనాన్ని నిర్మించి తానే యజమానిగా పేర్కొంటూ ఓ వ్యక్తికి నిర్మాణ సంస్థ విక్రయించింది. అందులో సూపర్‌మార్కెట్‌ ఏర్పాటు చేశారు. బిల్డర్‌ వ్యవహార శైలిపై పిటిషనర్‌ సంఘం అబోట్స్‌బరీ ఓనర్ల అసోసియేషన్‌ హైకోర్టులో వ్యాజ్యం వేసింది.

ప్లానింగ్‌ అనుమతులను ఉల్లంఘించారు: ప్లానింగ్‌ అనుమతులను ఉల్లంఘిస్తూ నాన్‌ ఎఫ్‌ఎస్‌ఐ నిర్మాణాన్ని వినియోగిస్తున్నారని పేర్కొంది. మంజూరు చేసిన ప్లాన్‌ ప్రకారం భవనాన్ని పునరుద్ధరించాలని కోరింది. భవనం బేస్‌మెంట్, గ్రౌడ్‌ ఫ్లోర్‌ను తమ అసోసియేషన్‌కు అప్పగించాలంది. వివాదాస్పదమైన బిల్డింగ్‌ పోర్షన్‌ ప్లానింగ్‌ అనుమతిలో భాగమేనని పేర్కొంది. అపార్టుమెంట్‌ వాసుల ఉమ్మడి సౌకర్యాల కోసం దానిని ఉద్దేశించారంది. దానిపై ఫ్లాటు యజమానులకే హక్కుంటుందని తెలిపింది.

ఎలాంటి సొమ్ము వసూలు చేయలేదు: నాన్‌ ఎఫ్‌ఎస్‌ఐ బిల్డింగ్‌ ఉమ్మడి ప్రాంతంలో భాగం కాదని, అది బిల్డర్‌కే చెందుతుందని నిర్మాణ సంస్థ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నాన్‌ ఎఫ్‌ఎస్‌ఐ ఉమ్మడి ప్రాంతం కిందకు రాదని తెలిపారు. భూమి విలువ కట్టే సమయంలో లేదా భవన నిర్మాణ విషయంలో నాన్‌ ఎఫ్‌ఎస్‌ఐ ప్రాంతానికి ఎలాంటి సొమ్ము వసూలు చేయలేదన్నారు. మొత్తం నిర్మాణ ప్రాతం 1.30 లక్షల చ.అడుగులు అని పేర్కొనడానికి బదులు పొరపాటున 2లక్షల చ.అడుగులుగా పేర్కొన్నామన్నారు.

బిల్డర్‌ వ్యవహార శైలిని తప్పుపట్టిన ధర్మాసనం: విచారణ జరిపిన ధర్మాసనం బిల్డర్‌ వ్యవహార శైలిని తప్పుపట్టింది. ‘బిల్టప్‌ ప్రాంతాన్ని 2లక్షల చ.అడుగులుగా కృత్రిమంగా పెంచుతూ ఫ్లాటు యజమానులకు ఉమ్మడి భూమిలో వాటా ఉండదని పేర్కొనడంలో అర్థం లేదని తెలిపింది. అవిభాజ్య వాటాకి సొమ్ము చెల్లించలేదనే బిల్డర్‌ వాదనతో ఏకీభవించలేమని.. భూమికి, భవనానికి ఏ ప్రమోటర్‌ వేర్వేరుగా ఛార్జీలు వసూలు చేయలేరంది. ఉదాహరణకు ఎవరైనా 1000 చ.అడుగుల అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేస్తే భూమి విలువతోపాటు భవనం విలువను బిల్డర్‌ వసూలు చేస్తారు. ప్రస్తుత కేసులో బిల్డర్‌ నిర్మాణ విస్తీర్ణం పెంచామనే కారణం చూపుతూ ఫ్లాటు యజమానులకు చెందాల్సిన అవిభాజ్య వాటాను తగ్గించారని అభిప్రాయపడుతున్నామని కోర్టు తెలిపింది.

ఉద్దేశపూర్వకంగానే తప్పు: బిల్డర్‌ ఉద్దేశపూర్వకంగానే ఈ తప్పు చేశారని.. ఫ్లాటు యజమానులకు చెందాల్సిన అభివాజ్యవాటాను వారికి చెందదని బిల్డర్‌ చెప్పడం సరికాదంది. భూమి విలువను చెల్లించేలా పిటిషనర్‌ అసోసియేషన్ను ఆదేశించాలన్న బిల్డర్‌ వాదనను తోసిపుచ్చుతున్నామని తీర్పులో తెలిపింది . అన్‌డివైడ్‌ షేర్‌ విషయంలో తమకు అదనపు సొమ్ము, స్టాంపు డ్యూటీ చెల్లించి విక్రయ దస్తావేజులు రాసుకునేలా అవకాశం కల్పించాలన్న బిల్డర్‌ అభ్యర్థన సరికాదంది.

ఫ్లాటు ఓనర్స్​ అసోసియేషన్‌కు అప్పగించాలి: స్థలం ఒకసారి కామన్‌ ఏరియా, కామన్‌ సౌకర్యాల అభివృద్ధి కోసం అని పేర్కొన్నాక ఆ భూమి ఫ్లాటు యజమానులదే అవుతుందని.. అవిభాజ్య వాటాను మదింపు చేయడంలో పొరపాటు జరిగి ఉంటే దానిని సవరించాల్సింది బిల్డరే నని తీర్పులో తెలిపింది. జరిగిన పొరపాటును బిల్డర్‌ అనుకూలంగా మార్చుకుని ఆ స్థలంపై సొమ్ము చెల్లించాలని కోరరాదు. అవిభాజ్య వాటాలో ఫ్లాటు యజమానులందరికి హక్కు దఖలు పడేలా ‘సవరించిన దస్త్రాలు’ రాసి ఇవ్వాలని బిల్డర్‌ను ఆదేశించింది . ఏమైన స్టాంప్‌ డ్యూటీ చెల్లించాల్సి వస్తే దాన్ని ఫ్లాటు యజమానులు భరించాలని పేర్కొంది. నాన్‌ ఎఫ్‌ఎస్‌ఐ ఖాళీ భవనాన్ని తక్షణమే పిటిషనర్‌ ఫ్లాటు ఓనర్స అసోసియేషన్‌కు అప్పగించాలని చెన్నై మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీని ఆదేశిస్తున్నాం’’ అని కోర్టు తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.