Weather Updates in AP: ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కురిసిన అకాల వర్షాలతో భారీ పంట నష్టం ఏర్పడింది. మళ్లీ ఇప్పుడు వర్షాలు అంటే అన్నదాతలు బెంబెలెత్తుతున్నారు. వచ్చిన నష్టాన్నే ఎలా తీర్చుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. తాజాగా వాతావరణంపై భారత వాతావరణ విభాగం లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చింది.
రాగల 48గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతం తమిళనాడు తీరప్రాంతాలు-ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 8వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. ఆ తర్వాత తుఫానుగా బలపడి ఉత్తర దిశగా మధ్య బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఉరుమలతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది.
ఇవీ చదవండి: