Vijayawada NIA Court Key comments: విశాఖ ఎయిర్ పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడి కేసుకు సంబంధించి.. విజయవాడలోని ఎన్ఐఏ కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడు శ్రీనివాస్ రావు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 31కి వాయింది వేసింది. ఈ కేసులో బాధితుడి (వైఎస్ జగన్) సాక్ష్యం కీలకమని.. నిబంధనల ప్రకారం వరుస క్రమంలో బాధితులు, సాక్షులందరూ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ కేసులో బాధితుడు జగన్ స్టేట్‌మెంట్‌ను తనకి ఇచ్చిన ఛార్జీషీట్ కాపీలో లేదని పిటిషనర్ తరపు న్యాయవాది సలీం కోర్ట్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో బాధితుడు స్టేట్‌మెంట్ తీసుకున్నామని.. వాటి కాపీని పిటిషనర్ న్యాయవాదికి ఇస్తామని ఎన్‌ఐఏ న్యాయవాది కోర్ట్‌కు తెలిపారు. ఈ కేసులో బాధితుడి సాక్ష్యం కీలకమని, నిబంధనల ప్రకారం వరుస క్రమంలో బాధితులు, సాక్షులందరూ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని న్యాయమూర్తి అన్నారు. నిందితులు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. పిటిషన్‌ను కొట్టేసిందని, ఈ నెల 31వ తేదీ నుంచి దాడి ఘటనపై రెగ్యూలర్ విచారణ జరుగుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది సలీం తెలిపారు.
విజయవాడలోని NIA కోర్టులో గత నెల 3వ తేదీన బెయిల్ పిటిషన్ వేశాము. దానిపై ఈరోజు విచారణ జరిగింది. కోర్టు బెయిల్‌ను కొట్టివేసింది. ఇలా బెయిల్ పిటిషన్ కొట్టివేయడం ఏడవసారి. అప్పట్లో రెండవ బెయిల్ వచ్చినప్పుడు దానిపై ఎన్ఐఏ వాళ్లు హైకోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి విచారణ నడుస్తోంది. ఇంతవరకూ హైకోర్టుకు వెళ్లలేదు. త్వరలోనే హైకోర్టుకు వెళ్తున్నాం. -సలీం, పిటిషనర్ న్యాయవాది
ఇవీ చదవండి