ETV Bharat / state

ఐటీఐ కాలేజీలను గాలికొదిలేసిన జగన్ సర్కార్! 8వేల రెగ్యులకు పోస్టులకు 1,140 మాత్రమే బోధనా సిబ్బంది - తిరుపతి ఐటీఐ కళాశాల

ITI Collages Problems In Andhra Pradesh : పేద విద్యార్థులు చదువుకునే ఐటీఐ కాలేజీలను ప్రభుత్వం గాలికొదిలేసింది. చాలా ఐటీఐల్లో బోధన సిబ్బందిని సైతం సర్కారు నియమించడం లేదు. సొంత భవనాలు లేక ప్రభుత్వ పాఠశాలలు, అద్దె భవనాల్లోనే తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి కనిపిస్తోంది. ఫలితంగా క్యాంపస్ రిక్రూట్​మెంట్ లేక ఐటీఐ అంటేనే విద్యార్థులు ఆమడదూరం జరిగే పరిస్థితి నెలకొంది.

iti_collages_problems_in_andhra_pradesh
iti_collages_problems_in_andhra_pradesh
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 10:35 AM IST

ITI Collages Problems In Andhra Pradesh : రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వేస్తున్నామని సీఎం జగన్ పదే పదే ఊదరగొడుతున్నా, క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎక్కువ మంది పేద విద్యార్థులు చదువుకునే ఐటీఐలను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. కొన్ని చోట్ల అసలు కళాశాలలకు భవనాలే లేవు. కర్నూలు జిల్లా ఆదోనిలో.. మైనారిటీ ఐటీఐకి భవనం నిర్మించి ఐదు ట్రెడ్‌ల ఏర్పాటుకు అనుమతులిచ్చినా.. నాలుగున్నరేళ్లుగా తరగతులు ప్రారంభంకాలేదు. శ్రీసిటీ లాంటి పారిశ్రామికవాడకు సమీపంలో ఉన్న తడ ఐటీఐలోనూ బోధన సిబ్బంది లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాలైన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ఐటీఐలో కంప్యూటర్లు, పరీక్షల నిర్వహణకు సరిపడిన సామగ్రి లేక.. వార్షిక పరీక్షలకు విద్యార్థులను విజయనగరం ఐటీఐకి పంపే దుస్థితి ఉంది.

గోదాంలో పరీక్షలు...నేలపై కూర్చోబెట్టి నిర్వహణ

Faculty Problems In Ap ITI Collages : ఐటీఐల్లో కీలకమైన శిక్షణ అధికారి, సహాయ, డిప్యూటీ శిక్షణాధికారుల ఖాళీలను సర్కారు భర్తీ చేయడం లేదు. దాదాపు 8 వేల 77 మంది సిబ్బంది అవసరం ఉండగా.. కేవలం 1,140మంది మాత్రమే పని చేస్తున్నారు. చిత్తూరు, పుంగనూరు ఐటీఐల్లో బోధనకు 16 మంది అవసరం కాగా..రెగ్యులర్‌ సిబ్బంది ఐదుగురే ఉన్నారు. జిల్లాలో అన్ని కళాశాలల్లోనూ ఒక్కో ఇన్‌స్ట్రక్టర్‌ మూడు, నాలుగు ట్రేడ్స్‌కి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి జిల్లా తడలో 10 మంది శిక్షకులు అవసరం కాగా నలుగురితోనే తరగతులు నెట్టుకొస్తున్నారు. ఇనిస్ట్రుమెంట్‌ మెకానిక్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, కోపా ట్రేడ్‌లకు సంబంధించి శిక్షకుల పోస్టులు ఆరు ఖాళీగా ఉన్నాయి. అరకులోయ ఐటీఐలో ఫిట్టర్‌ ట్రేడ్‌కి బోధనా సిబ్బంది లేరు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ఐటీఐలో 11మంది బోధనా సిబ్బందికి గాను ప్రిన్సిపల్‌తో కలిపి నలుగురే పనిచేస్తున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి ఐటీఐలో ఎలక్ట్రీషియన్, కోపా, ఏసీ మెకానిక్‌ విభాగాల పోస్టులు భర్తీ కాలేదు. తెనాలి ఐటీఐలో అన్ని విభాగాల్లో కలిపి 57 మంది అధికారులు, సిబ్బంది ఉండాల్సి ఉండగా ..22 మంది మాత్రమే పని చేస్తున్నారు. వైఎస్సార్‌ జిల్లా మైలవరం ఐటీఐలో 68 మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుతం ఒక్కరే రెగ్యులర్‌ అధ్యాపకుడు విధులు నిర్వహిస్తున్నారు.

65 ఏళ్ల ఐటీఐ 'విద్యార్థి'.. చదువుల్లో మేటి!

Tirupati ITI Collage : తిరుపతి జిల్లా తడ ఐటీఐలో వర్క్‌ షాపుల కొరత విద్యార్థులను వేధిస్తోంది. చాలినన్ని భవనాలు, పరికరాల్లేవు. కోపా, ఇనిస్ట్రుమెంట్‌ మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ మెకానిక్‌కు సంబంధించి వర్క్‌షాపులు లేవు. వీరి శిక్షణ దైవాదీనంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలోఐదు కోర్సులకు ..యంత్రాలు, పరికరాలు లేవు. పనిముట్లు సమకూర్చేందుకు రెండున్నర కోట్లు అవసరం కాగా.. ప్రభుత్వం ఈ మొత్తాన్నీ ఇవ్వ లేదు. అల్లూరి జిల్లా చింతపల్లి ఐటీఐలో గిరిజన విద్యార్థులకు నిర్మించిన వసతి గృహానికి ప్రహరీ లేదు. నిధులు లేవంటూ భవనాన్ని అసంపూర్తిగా వదిలేశారు. ల్యాబ్‌ల సంగతి సరే సరి. బాలికలకు వసతిగృహం లేక అద్దెకు గదులు తీసుకుని ఉంటున్నారు. కొన్ని చోట్ల వసతి గృహాలు ఉన్నా.. మౌలిక సదుపాయాలు లేవు. ఏలూరు జిల్లా చింతలపూడి కళాశాలలో తాగునీరు లేక విద్యార్థులు.. వాటర్‌ క్యాన్‌లు తెచ్చుకుంటున్నారు. తిరుపతి జిల్లా తడ ఐటీఐలో విద్యార్థులు కూర్చునేందుకు బల్లలు లేవు. కొన్ని గదుల్లో డెస్క్‌లు తుప్పు పట్టాయి.

'ఐటీఐ విద్యాలయాల్లో ఆన్​లైన్ పరీక్షను ఎత్తివేయాలి'

ITI Building Problems : నంద్యాలలో ఐటీఐకి సొంత భవనం లేక పాఠశాల ఆవరణలో తరగతులు నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులోనూ ఇదే దుస్థితి. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో ప్రభుత్వ పాఠశాల పక్కనున్న భవనంలో తరగతులు చెప్తున్నారు. అల్లూరి జిల్లా హకుంపేట ఐటీఐకి భవనాలు లేక విశాఖలోని నరవ వద్ద కొనసాగిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఐటీఐని పాత జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తూ ..డీఆర్‌డీఏ కార్యాలయంలోని చిన్న గదుల్లో ప్రాక్టికల్స్‌ చేయిస్తున్నారు. గుంతకల్లు ఐటీఐను ఏసీఎస్‌ మిల్లుకు చెందిన పాఠశాలలో నిర్వహిస్తున్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం ఐటీఐ తరగతులు పాఠశాల భవనంలోనే జరుగుతున్నాయి. సత్యసాయి జిల్లా హిందూపురం ఐటీఐ ..లేపాక్షిలోని పాత బీసీ వసతి గృహంలో కొనసాగుతోంది. వైయస్‌ఆర్‌ జిల్లా మైలవరం ఐటీఐను భవనాల కొరతతో జమ్మలమడుగుకు మార్చారు. తిరుపతి జిల్లా తడ ఐటీఐలో లక్షలు వెచ్చించి నిర్మించిన హాస్టల్‌ భవనం నిరుపయోగంగా మారడంతో కొందరు పశువుల పాకగా వినియోగిస్తున్నారు. నెల్లూరులోని ఐటీఐ కళాశాలలో తరగతుల పైకప్పు సరిగ్గా లేక వర్షపు నీరు కారుతోంది.

ITI Students Problems : అరకులోయలో ప్రభుత్వ నివాసానుబంధ పారిశ్రామిక శిక్షణ సంస్థలో విద్యార్థులు అరకొర వసతులతో ఇబ్బందిపడుతున్నారు. ఒంగోలులోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో వర్క్‌షాప్‌లు ఉన్న రేకులు దెబ్బతిని ...వర్షం వస్తే నీరు కారుతోంది. ఏలూరు జిల్లా చింతలపూడిలో రేకుల షెడ్డులోనే తరగతులు నడుస్తున్నాయి. పార్వతీపురం జిల్లా సాలూరులో అద్దె భవనంలో తరగతులు జరుగుతున్నాయి. సొంత భవన నిర్మాణానికి కేంద్రం 5కోట్లు మంజూరు చేసినా ..సర్కారు స్థలం కేటాయించలేదు. చిత్తూరు జిల్లా విజయపురంలో ఎనిమిదేళ్లుగా అద్దె భవనాల్లోనే ఐటీఐ తరగతులు నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ఐటీఐ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన అద్డె భవనంలో నడుస్తోంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఐటీఐ అద్దె భవనంలో కొనసాగుతోంది. ప్రయోగశాలలు లేవు. భవనాల ఏర్పాటుకు 14 కోట్లు అంచనాలు పంపించినా.. ప్రతిపాదనలకు సర్కారు ఇంతవరకు ఆమోదం తెలపలేదు.

ఐటీఐ కాలేజీలను గాలికొదిలేసిన జగన్ సర్కార్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.