ETV Bharat / state

'వివేకా హత్య కేసు దేశ చరిత్రలో సస్పెన్స్ థ్రిల్లర్.. ఆ పదం జగన్‌కి సరిగ్గా సరిపోతుంది' - April fool news

Chandrababu criticized CM Jagan: సీఎం జగన్‌ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శాస్త్రాలు సంధించారు. ముందస్తుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదని సీఎం జగన్‌ భావిస్తే అది పగటి కలే అవుతుందని అన్నారు. ప్రజలందరినీ ఎల్లకాలం ఫూల్స్ చేయొచ్చనే భ్రమలో జగన్‌ ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.

babu
babu
author img

By

Published : Apr 1, 2023, 7:27 PM IST

Updated : Apr 2, 2023, 1:20 PM IST

వివేకా హత్య కేసు దేశ చరిత్రలో సస్పెన్స్ థ్రిల్లర్

Chandrababu criticized CM Jagan: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదని.. సీఎం జగన్‌ మోహన్ రెడ్డి భావిస్తే అది పగటి కలే అవుతుందని.. చంద్రబాబు నాయుడు అన్నారు. రేపు ఎన్నికలు పెట్టినా తాము సిద్ధంగా ఉన్నామని.. జగన్‌ని ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. మీడియా ఏర్పాటు చేసిన చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చింది షాక్ ట్రీట్మెంట్ మాత్రమేనని.. వచ్చే ఎన్నికల్లో చేసేది శాశ్వత చికిత్సని వ్యాఖ్యానించారు.

బుద్ధి ఉన్న రాజకీయ ప్రత్యర్థులు ఆ ప్రశ్న అడగరు: ''రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తోందో చెప్పాలి అనే ప్రశ్న బుద్ధి ఉన్న రాజకీయ ప్రత్యర్థులు ఎవ్వరూ మమ్మల్ని అడగరు. మేం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో వారికి చెప్పాలా..?. 175 స్థానాల్లో వైసీపీని ఓడించటమే మా లక్ష్యం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకున్న 23 బలంతోనే మా అభ్యర్థిని మేము గెలిపించుకున్నాం. తెలుగుదేశం నుంచి గాడిదల్ని తొలుకెళ్లిన్నట్లు కొందరు ఎమ్మెల్యేలను తోలుకెళ్లి, తిరిగి ఎదురు నిందలు వేయడం విడ్డూరంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే వచ్చినా రాజీనామా చేసి రావాలని జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో అనలేదా..?. నీతిమాలిన పనులు చేస్తూ.. మాపై నిందలు వేస్తారా..?. ఎమ్మెల్యే కోటాలో మాకు రావాల్సిన ఒక ఎమ్మెల్సీ సీటు కోసం పోటీ చేయటం అనైతికమనటం బుద్దిలేని తనం కాక మరేంటి'' అని చంద్రబాబు నాయుడు ప్రశ్నల వర్శం కురిపించారు.

ఏప్రిల్ ఫూల్ పదం జగన్‌కు సరిపోతుంది: అనంతరం ఏప్రిల్ ఫూల్ అనే పదం సీఎం జగన్‌కి సరిగ్గా సరిపోతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజలందరినీ ఎల్లకాలం ఫూల్స్ చేయొచ్చనే భ్రమలో జగన్‌ ఉన్నారని.. కానీ, రాష్ట్ర ప్రజలంతా కలిసి జగన్‌నే ఫూల్‌ చేసేందుకు సిద్ధమయ్యారని గుర్తు చేశారు. పుట్టిందే రాష్ట్ర విధ్వంసం కోసం అన్నట్లుగా జగన్‌ ఉన్నారని.. సీఎం చెడు ఆలోచనలు అంచనా వేయటం కష్టమేమో కానీ, అతని భవిష్యత్తు ఏంటో అంతా అంచనా వేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ-రాష్ట్ర ప్రజలు సిద్దంగా ఉన్నాం: రాష్ట్రంలో ఎప్పుడు ముందస్తులు ఎన్నికలొచ్చినా టీడీపీ సిద్దంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రేపు ఎన్నికలు పెట్టినా తాము సిద్ధంగా ఉన్నామని, తమతోపాటు రాష్ట్ర ప్రజలు కూడా జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపిద్దామా అనే ఆలోచనతో సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన వైఫల్యం ఉందన్న బొత్స సత్యనారాయణ..తమ మంత్రి పదవికి రాజీనామా చేయొచ్చుగా అని చంద్రబాబు అన్నారు.

ఉండవల్లి శ్రీదేవికి అండగా ఉంటాం: ఉండవల్లి శ్రీదేవికి ప్రాణహాని ఉందంటున్నారని, ఆమెకు రక్షణ కల్పిస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. గతంలో రఘు రామకృష్ణం రాజుకు కూడా రక్షణ కల్పించినట్టే ఆమెకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీలోని నేతలు బానిసల్లా బతుకుతున్నారన్న చంద్రబాబు తమతో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని అన్నారు. వివేకా హత్య కేసు.. దేశ చరిత్రలో సస్పెన్స్ థ్రిల్లర్ అని వ్యాఖ్యనించారు. ఫిక్షన్ కథలు రాసేవారు కూడా ఇలాంటివి రాయలేరని ఎద్దేవా చేశారు. ఇన్ని ట్విస్టులు ఉన్న కేసు దేశంలో మరొకటి లేదన్న ఆయన..ఇలాంటి కేసు పోతే.. వ్యవస్థల మీద నమ్మకం పోతుందన్నారు. జగన్.. పెద్ద దోపిడీదారు.. ఆయన పేదల ప్రతినిధి కాదు? అని చంద్రబాబు పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు: రాష్ట్రంలో ఫేక్ గేమ్‌వార్ బాగా నడుపుతున్నారు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారన్న ఆయన..చెత్త మీద పన్ను, ఆస్తి పన్ను ప్రజలకు భారంగా మారాయని గుర్తు చేశారు. ఒక్క ఏడాదిలోనే రూ.96,273 కోట్లు అప్పు చేశారని ఆయన దుయ్యబట్టారు. మన రాష్ట్రం.. అప్పుల ఊబిలో కూరుకుపోతోందని..రాబోయే రోజుల్లో ప్రతి పేదవాడు ధనికుడు కావాలని.. ఆ దిశగానే తాము అడుగులు వేస్తున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఇవీ చదవండి

Last Updated : Apr 2, 2023, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.