ETV Bharat / state

తేమ పేరుతో మోసం.. ధాన్యం రైతులను దోచేస్తున్న మిల్లర్లు - Irregularities in procurement of grain

fraud in procurement of grain : తేమ పేరిట ధాన్యం రైతులను అడ్డంగా దోచేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఓ రైతు 19ఎకరాల్లో ధాన్యాన్ని ఆర్​బీకేకి విక్రయించగా.. 90 వేల రూపాయలు కోత పెట్టేశారు. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా ఈ దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అన్నదాతకు అండగా ఉండాల్సిన పౌరసరఫరాల సంస్థ, ఆర్బీకేలు మిల్లర్ల దోపిడీకి వత్తాసు పలుకుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

procurement of grain
ధాన్యం కొనుగోలు
author img

By

Published : Dec 12, 2022, 10:33 PM IST

తేమ పేరుతో మోసం.. ధాన్యం రైతులను దోచేస్తున్న మిల్లర్లు

Procurement of Grain: ధాన్యం కనీస మద్దతు ధర కంటే పైసా తగ్గకూడదు.. రైతులకు అందాల్సిన మొత్తం పక్కాగా అందాల్సిందే.. ఇదీ ధాన్యం సేకరణపై సమీక్ష సందర్భంగా ఇటీవల ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఇచ్చిన ఆదేశం. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. సీఎం మాటలు నీటిమూటలుగా మిగులుతున్నాయి. రైతులు ఎంత ధాన్యం విక్రయించారనే రశీదులతో సంబంధం లేకుండా.. మిల్లర్లు చెప్పిన లెక్కలనే ఆర్బీకేల్లో నమోదు చేస్తున్నారు. తుపాను ప్రభావంతో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నందున త్వరగా ధాన్యం అమ్ముకోవాలని రైతులు ప్రయత్నిస్తున్నారు. ఇదే అదునుగా తేమ శాతం పేరిట మిల్లర్లు అడ్డంగా దోచుకుంటున్నట్లు.. ఈనాడు-ఈటీవీ భారత్​ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది.

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మద్దూరుకు చెందిన యనమదల రామ్మోహనరావు, జేబీ, రాజేష్‌ 19 ఎకరాల్లో వరి పండించారు. ఇటీవలే రైతు భరోసా కేంద్రం ద్వారా రెండు విడతలుగా 485.30 క్వింటాళ్ల ధాన్యం విక్రయించారు. తరుగు కింద బస్తాకు కిలో చొప్పున మినహాయిస్తే.. 474.20 క్వింటాళ్ల ధాన్యానికి 9 లక్షల 67వేల 368 రూపాయల సొమ్ము రావాలి. కానీ 430 క్వింటాళ్ల ధాన్యమే అమ్మినట్లుగా ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. ఆ లెక్కన 90 వేల 168రూపాయల నష్టపోయానని రామ్మోహనరావు వాపోతున్నారు.

"నేను విక్రయించిన వడ్లకు నా ఖాతాలో జమ అయిన నగదుకు తేడా 40 క్వింటాళ్లు వస్తోంది. నగదు పూర్తిగా జమ కాలేదు. మిగిలిన నగదు పరిస్థితి ఎంటీ. వాళ్ల లెక్కల ప్రకారమే ఇంకా 90వేల రూపాయలు రావాలి. నగదు గురించి అడిగితే లెక్కలు సరిచూడాలి అంటున్నారు." -రామ్మోహనరావు, రైతు, మద్దూరు

మద్దూరు గ్రామానికే చెందిన అప్పారావు సహా మరికొందరు రైతులదీ ఇదే పరిస్థితి. అమ్మిన ధాన్యానికి, ఫోన్లకు వస్తున్న మెసేజ్‌లో చూపిస్తున్న లెక్కలకు చాలా తేడా ఉంటోంది. రైతుభరోసా కేంద్రంలో తేమ శాతం 17శాతమే ఉన్నప్పుడు, మిల్లర్ వద్దకు వెళ్లాక ఎలా పెరిగిందని రైతులు ప్రశ్నిస్తున్నారు.

"అధికారులను ధాన్యంలో, ఖాతాలో జమ అయిన నగదు తేడా గురించి అడిగితే తేమ శాతం వల్ల తీసేశామంటున్నారు. నాకు 15వేల రూపాయల నగదు తేడా వస్తోంది." -అప్పారావు, రైతు, మద్దూరు

ఆర్​బీకేలతో ఉద్ధరిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి పూర్తి విరుద్ధమని రైతులు అంటున్నారు. దళారులకు అమ్ముకున్నప్పుడే ప్రశాంతంగా ఉండేదని, ప్రభుత్వ జోక్యం పెరిగాక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పంట విరామమే దిక్కని తేల్చిచెబుతున్నారు.

"దళారులకు అమ్ముకుంటే నగదు తక్కువగా వచ్చినా.. కొనుగోళ్లు వేగంగా జరిగేవి. ఇలా అకాల వర్షాలకు తడిసిపోయేవి కావు. ధాన్యం తూకాలు వేయటంలేదు. వేసినా వాటిని మిల్లులకు పంపించటం లేదు. దీనివల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రైతు భరోసా కేంద్రాల వద్ద చూసిన తేమ శాతమే చివరిదని.. ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తున్నారు. అక్కడ మిల్లర్లు తేమ శాతం 3నుంచి 4 పాయింట్లు అధికంగా చూపిస్తున్నారు. ఇప్పుడు అదే దళారుల దోపిడీ, మిల్లర్ల దోపిడీ." -యనమదల వెంకటేశ్వర్రావు, రైతు, మద్దూరు

తేమ శాతం లెక్కలతో రశీదులు ఇవ్వడం సహా ధాన్యం కొనుగోల్లో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.