Andhra Pradesh Weather Report Updates: ఆంధ్రప్రదేశ్ వాతావరణానికి సంబంధించి.. భారతదేశ వాతావరణ విభాగం కీలక విషయాలను వెల్లడించింది. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఎలా ఉండనుంది..?, వర్షాలు ఏయే మాసాల్లో పడనున్నాయి..?, ఒకవేళ వర్షం పడితే ఎంత శాతం వరకు నమోదయ్యే అవకాశం ఉంది..? వంటి తదితర వివరాలను ఓ ప్రకటనలో పేర్కొంది.
ఎల్-నినో ప్రభావంతో 96శాతం వర్షపాతం నమోదు.. నైరుతీ రుతుపవనాలు ఈసారి సాధారణ వర్షపాతాన్ని కురిపించే అవకాశం ఉందని.. భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఎల్-నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా 96 శాతం మాత్రమే వర్షపాతం నమోదు అవుతుందని స్పష్టం చేసింది. ఇక, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. జూన్ నెలతో ప్రారంభమై, సెప్టెంబరు వరకూ నైరుతీ రుతుపవన వర్షాలు నమోదు అవుతాయని పేర్కొంది. అయితే, జూన్ నెలలోనూ అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే సూచనలు కూడా ఉన్నాయని తెలియజేసింది.
Rains: ఎండాకాలంలో వర్షాలు.. రాష్ట్రంలో మరో రెండు రోజులు ఇదే పరిస్థితి
రాగల రెండు రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరణ.. పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ఎల్-నినో ప్రభావంతో నైరుతీ రుతుపవనాల సాధారణంగానే నమోదు అయ్యే అవకాశం ఉందని.. భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ తీరంపై అవరించిన నైరుతీ రుతుపవనాలు రాగల రెండు రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ విభాగం పేర్కొంది. అందుకు అనుకూలమైన పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించింది. అయితే, ఈసారి సాధారణ వర్షపాతమే నమోదు అయ్యే సూచనలు ఉన్నట్టు తెలిపింది. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే.. దేశవ్యాప్తంగా ఈసారి 96 శాతం మేర నైరుతీ రుతుపవనాల వర్షపాతం నమోదు అవుతుందని వివరించింది.
High Temperatures: మండుతున్న ఎండలు.. హడలిపోతున్న ప్రజలు
రాష్ట్రంలో సాధారణ వర్షపాతమే నమోదు.. ఈసారి నైరుతీ రుతుపవనాల కారణంగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ వర్షపాతమే నమోదు అవుతుందని వాతావరణ విభాగం వెల్లడించింది. దక్షిణ భారత్లోని అన్ని ప్రాంతాల్లోనూ నైరుతీ రుతుపవనాల ప్రభావం సాధారణంగానే ఉందని తెలియజేసింది. మరికొన్ని కొన్ని చోట్ల సాధారణం కంటే అధిక వర్షపాతమే నమోదు అయ్యే సూచనలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి జూన్ మాసంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగానే నమోదు అయ్యే సూచనలు ఉన్నట్టు ఐఎండీ తెలియజేసింది.
రాయలసీమ జిల్లాల్లో జల్లుల వర్షం.. మరోవైపు దేశవ్యాప్తంగా తాజాగా వేర్వేరు ప్రాంతాల్లో నమోదు అవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా ముందస్తు రుతువవన జల్లులు నమోదు అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి చాలా చోట్ల ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు నమోదు అవుతున్నాయని తెలియచేసింది. ఏపీలోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్టు అమరావతి వాతావరణ విభాగం తెలిపింది.