AP High Court sentenced IAS and EIS Secretary to imprisonment and fine: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఓ ఐఏఎస్, ఈఐఎస్ కార్యదర్శిపై నమోదైన ఫిర్యాదుల విషయంలో సంచలన తీర్పును వెలువరించింది. ఉపాధ్యాయులకు పాత పింఛన్ స్కీమ్‌ను అమలు చేయాలంటూ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని..కోర్టు ధిక్కరణ కేసు కింద నెల రోజుల జైలు శిక్ష, జరిమానాను విధించింది. అంతేకాదు, ఆ ఇద్దరు అధికారులు ఈనెల 16లోగా రిజిస్ట్రార్ జ్యుడీషియల్ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. మరీ ఎవరా ఇద్దరు అధికారులు..? కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదు..? అనే తదితర విషయాలు మీకోసం..
ఇద్దరు అధికారులకు జైలు శిక్ష.. కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) షాక్ ఇచ్చింది. ఐఏఎస్ అధికారి జయలక్ష్మికి, ఏపీఎస్ డబ్లూఆర్ ఈఐఎస్ కార్యదర్శి పవనమూర్తికి నెల రోజుల జైలు శిక్ష, జరిమానాను విధిస్తూ..ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఈ నెల (ఆగస్టు) 16వ తేదీలోగా రిజిస్ట్రార్ జ్యుడీషియల్ ముందు లొంగిపోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టును ఆశ్రయించిన టీచర్లు.. అనంతరం శిక్ష అనుభవించేందుకు వారిని జైలుకు పంపించాలని.. రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు స్పష్టం చేసింది. అయితే, ఈ ఇద్దరి అధికారులకు న్యాయస్థానం ఎందుకు శిక్ష విధించిందనే వివరాలను పరిశీలిస్తే.. గతంలో కొంతమంది ఉపాధ్యాయులు తమకు 'కొత్త పింఛన్ స్కీమ్ వద్దు-పాత పింఛన్ స్కీమ్ అమలే ముద్దు' అనే నినాదంతో ధర్నాలు, రాస్తారోకాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పాత పింఛన్ స్కీమ్ అమలు చేసేలా హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలంటూ టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై పలుమార్లు విచారించిన న్యాయస్థానం.. టీచర్లకు పాత పింఛన్ స్కీమ్‌ను అమలు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
హాజరుకావాలని ఆదేశాలు ఇస్తేనే అమలు చేస్తారా?.. అధికారులపై హైకోర్టు కన్నెర్ర
ఈనెల 16లోగా లోంగిపోవాలి.. ఈ నేపథ్యంలో రోజులు గడుస్తున్నా.. రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను అధికారులు అమలు చేయలేదు. దీంతో మరోసారి టీచర్లు హైకోర్టుకు దృష్టికి తీసుకురాగా అధికారులపై తీరుపై న్యాయస్థానం ఆగ్రహించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్, ఈఐఎస్ కార్యదర్శికి జైలుశిక్ష, జరిమానా విధించింది. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడం కారణంగానే శిక్ష విధిస్తున్నట్లు కోర్టు జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది. అంతేకాకుండా, ఆ ఇద్దరు అధికారులు ఈనెల 16లోగా రిజిస్ట్రార్ జ్యుడీషియల్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఆ ఇద్దరు అధిాకారుల్లో ఒకరు సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా (జయలక్ష్మి) విధులు నిర్వర్తిస్తున్నారు. మరొకరు ఏపీఎస్‌డబ్ల్యూఆర్ ఈఐఎస్ కార్యదర్శిగా (పవనమూర్తి) విధుల్లో ఉన్నారు. వీరివురికి కోర్టు ధిక్కరణ కేసు కింద హైకోర్టు..నెల రోజుల జైలు శిక్ష, జరిమానా విధించింది.
High Court: "విద్యార్థులకు సీట్లు ఇవ్వకుంటే... మిమ్మల్ని జైలుకు పంపుతాం"